Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభHarshaali Malhotra: అఖండ 2లో క్రేజీ బ్యూటీ!

Harshaali Malhotra: అఖండ 2లో క్రేజీ బ్యూటీ!

Harshaali Malhotra in Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో యంగ్ హీరోల కంటే ముందు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అఖండ 2 చిత్రాన్ని చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ వచ్చి భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాను యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్నారు. అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించగా ఇప్పుడు దీనికి కొనసాగింపు వస్తోంది.

- Advertisement -

ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. అయితే, అఖండ 2 మూవీలో నటిస్తున్న ప్రధాన తారాగణం నందమూరి అభిమానులతో పాటుగా ప్రేక్షకులని ఎంతగానో సర్ ప్రైజ్ చేస్తుంది. మొదట ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ అనుకుంటే, ఆమె ప్లేస్‌లోకి సంయుక్త మీనన్ వచ్చి చేరింది. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటుగా అఖండ 2లో ఓ కీ రోల్ కోసం బాలీవుడ్ క్యూటీని తీసుకున్నారు.

హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భజరంగి భాయిజాన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్షాలి మల్హోత్రాను అఖండ 2 కోసం తీసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అఖండ 2 మూవీలో హర్షాలి ‘జనని’ అనే పాత్రలో అలరించబోతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సల్మాన్ ఖాన్ తో నటించిన ఈ కుర్రభామ ఇప్పుడు అఖండ 2 లో కనిపించి, ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనుంది. అఖండ 2 మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో హర్షాలికి ఈ సినిమా బాగా కలిసి వచ్చే అవకాశం మెండుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

బాలయ్య-బోయపాటిల కాంబినేషన్‌లో ఇప్పటికే, సింహ.. లెజెండ్.. అఖండ వచ్చి హ్యాట్రిక్ సాధించాయి. దీంతో ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి ఈ కాంబో రెడీ అవుతోంది. ఇక బాలయ్య వరుసగా నాలుగు చిత్రాలతో భారీ సక్సెస్‌లను చూశారు. అఖండ 2 గనక హిట్ అయితే ఇది 5వ బ్లాక్ బస్టర్ అవుతుంది. సీనియర్ హీరోలలో ఇంత వేగంగా హిట్ సినిమాలు చేస్తుందీ అంటే ఒక్క బాలయ్య మాత్రమే. సినిమాలే కాదు, మరోవైపు ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ సీజన్స్ కూడా చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News