Homeచిత్ర ప్రభSalman Khan: వంశీ పైడిపల్లికి సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌, ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌, నిర్మాత ఎవరంటే!

Salman Khan: వంశీ పైడిపల్లికి సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌, ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌, నిర్మాత ఎవరంటే!

Salman Khan-Vamshi Paidipally: బాలీవుడ్‌ ‘భాయ్‌జాన్‌’ సల్మాన్‌ ఖాన్‌ సౌత్‌ ఎంట్రీకి సిద్దమయ్యారు. తెలుగులో ఆయన స్ట్రయిట్‌ మూవీ చేయబోతున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్‌ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసిన సల్మాన్‌.. ఈ సారి తెలుగు ఫుల్‌ లెన్త్‌ చిత్రానికి రెడీ అయ్యారు. ఈ మధ్య సల్మాన్‌ ఖాన్‌ చిత్రాలు వరుసగా బాక్సాఫీసు వద్ద బొల్తా కొడుతున్నాయి. ఆయన ఖాతాలో మంచి హిట్‌ పడి చాలా కాలం అవుతుంది.

- Advertisement -

వంశీ, దిల్ రాజుతో
ప్రస్తుతం పాన్‌ ఇండియా ట్రెండ్‌ క్రేజ్‌ పెరగడంతో భాయ్‌జాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. పాన్‌ ఇండియా వచ్చాక.. సినీ ఇండస్ట్రీలో భాష హద్దులు తొలిగిపోయాయి. సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండ నటీనటులు ఇతర భాషల్లో చిత్రాల్లో నటిస్తున్నారు. మన తెలుగు దర్శకులు సైతం పాన్‌ ఇండియా ట్రెండ్‌ని ఫాలో అవుతూ.. ఇతర భాష హీరోలతో సైతం తెలుగు సినిమాలు చేస్తూ హిట్స్‌ కొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి సల్మాన్ ఒక భారీ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని సల్మాన్‌ స్వయంగా ప్రకటించారు.  ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో డైరెక్టర్‌ వంశీ పైడిపల్లితో దిగిన ఫోటోలు షేర్‌ చేశారు.

ఏప్రిల్ లో షూటింగ్
దీనికి ‘డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. ఈ ఏప్రిల్‌ నుంచి మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది’ అంటూ భాయ్‌జాన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక భాయ్‌జాన్‌ తెలుగు ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా ఈ చిత్రం పూర్తిస్థాయి హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందిని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి తన సినిమాల్లో బలమైన ఎమోషన్స్‌తో పాటు గ్రాండ్ విజువల్స్ ఉండేలా చూసుకుంటారు. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి సినిమాల తర్వాత వంశీ ఈసారి సల్మాన్ ఖాన్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్‌ను గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో చూపించేందుకు పక్కా స్కేచ్‌తో వేశాడట.

Also Read: Salman Khan: వంశీ పైడిపల్లికి సల్మాన్‌ గ్రీన్‌ సిగ్నల్‌, ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌, నిర్మాత ఎవరంటే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News