Samantha: ఇదివరకు హీరోయిన్లు యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత తమ అభిరుచులకు తగ్గట్లుగా సొంతంగా బిజినెస్‌లు మొదలుపెట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఓ వైపు సినిమాలతో తీరిక లేకుండా ఉంటూనే బిజినెస్‌లలో రాణిస్తున్నారు అందాల హీరోయిన్లు. నయనతార, కత్రినాకైఫ్, తమన్నాతో పాటు చాలా మంది టాప్ హీరోయిన్లు జ్యూవెల్లరీ, కాస్మోటిక్స్ బ్రాండ్స్‌ను లాంఛ్ చేసి సక్సెస్ అయ్యారు. మరికొందరు హీరోయిన్లు యాక్టింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకుంటున్నారు.
సమంత కూడా ఇటీవలే నిర్మాతగా మారింది. ట్రాలాలా మోషన్ పిక్చర్స్ పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌజ్‌ను స్థాపించిన సమంత తొలి ప్రయత్నంగా శుభం అనే సినిమాను నిర్మించింది. హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది.
Also Read – The Paradise: ఏడు కోట్లతో భారీ సెట్ – నో కాంప్రమైజ్ అంటున్న నాని ప్యారడైజ్ టీమ్
మరోవైపు సాకి పేరుతో ఉమెన్స్ ఫ్యాన్ డిజైన్ బ్రాండ్‌తో పాటు సీక్రెట్ ఆల్‌కెమిస్ట్ అనే పర్‌ఫ్యూమ్స్ బిజినెస్‌లను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోంది సమంత. ఈ రెండింటితో పాటు తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి ఎంటరైంది. ట్రూలీ స్మా అనే క్లాతింగ్ బ్రాండ్‌ను కూడా లాంఛ్ చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బుధవారం అఫీషియల్‌గా ప్రకటించింది సమంత. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్లాతింగ్ బ్రాండ్‌కు తాను సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నట్లు ఈ పోస్ట్‌లో సమంత పేర్కొన్నది. కొత్త బిజినెస్‌లోకి ఎంటరైన సమంతకు నెటిజన్లతో పాటు టాలీవుడ్ సెలిబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు.
విడాకులతో పాటు మయోసైటీస్ కారణంగా రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైన సమంత హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం పేరుతో ఫాంటసీ థ్రిల్లర్ మూవీ చేస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇటీవల అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. మా ఇంటి బంగారం మూవీలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాకు ఓ నిర్మాతగా సమంత వ్యవహరిస్తోంది. హిందీలో సమంత లీడ్ రోల్‌లో నటించిన రక్త్ బ్రహ్మాండ్ వెబ్‌సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ హారర్ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read – Kaantha Movie: ‘కాంత’ సినిమాను బ్యాన్ చేయండి – హైకోర్టును ఆశ్రయించిన కోలీవుడ్ సూపర్‌స్టార్ మనవడు


