Homeచిత్ర ప్రభMaa Inti Bangaram: సమంత 'మా ఇంటి బంగారం'.. డిలీటేడ్‌ సీన్స్‌ చూశారా?

Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’.. డిలీటేడ్‌ సీన్స్‌ చూశారా?

Maa Inti Bangaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ వసూళ్లను రాబట్టింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. సినిమాలో సమంత తన నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించి అభిమానుల ప్రశంసలు అందుకుంది.

- Advertisement -

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా డిలీటెడ్ సీన్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమాలో చోటు దక్కని కొన్ని సరదా సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. ముఖ్యంగా సమంత పాల్గొన్న ఫన్నీ మూమెంట్స్‌ తో పాటు సెట్స్‌లో జరిగిన సరదా సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ డిలీటెడ్ సీన్స్ వీడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సినిమాలో కనిపించని కొత్త కంటెంట్‌ను చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత అభిమానుల కోసం ఈ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News