Maa Inti Bangaram: కొన్ని సినిమాలకు ప్రకటనతోనే మంచి డిమాండ్ వచ్చేస్తుంటుంది. మరి కొన్ని చిత్రాలకు కాంబోలను బట్టి ధర పలుకుతుంటుంది. కొన్ని ప్రాజెక్టులు మాత్రం తమ కంటెంట్‌లను బట్టి తమ సత్తాను చాటుకుంటూ ఉంటాయి. గ్లింప్స్, టీజర్, ట్రైలర్ వంటి వాటితో అంచనాలు పెంచేసి ట్రేడ్ సర్కిళ్లలో డిమాండ్‌లను క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలో సమంత నటిస్తూ, నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ విషయంలోనూ ఇదే జరిగింది. సమంత నటిస్తున్న బంగారం చిత్రం నుంచి రీసెంట్‌గానే ఓ అప్డేట్ వచ్చింది.
సమంత పాత్రను పరిచయం చేస్తూ వదిలిన ఆ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. మరోక యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో సమంత ఇరగ్గొట్టేస్తోందని ఈ టీజర్ చెప్పకనే చెప్పేసింది. దీంతో ట్రేడ్ సర్కిళ్లలో ఈ బంగారం మీద దృష్టి పడింది. దీంతో డిమాండ్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా సమాచారం. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మూవీ కోసం సురేష్ బాబు కూడా రంగంలోకి దిగబోతున్నట్టుగా సమాచారం.
Also Read- Medaram: మేడారంలో లేడీ ఐపీఎస్ స్పెషల్ ఎట్రాక్షన్.. నెట్టింట వైరల్ అవుతున్న ఏసీపీ వసుంధర యాదవ్!
ఇక ఈ చిత్రంపై బజ్ పెరగడంతో మార్కెట్ ఓపెన్ చేశారట. ఇంకా షూటింగ్ ఎంత అయింది? ఎంత బ్యాలెన్స్ ఉంది? సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న విషయాలపై అయితే క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు బిజినెస్ మాత్రం జరిగిపోతోందని తెలుస్తోంది. ఏపీ, సీడెడ్ కలిపి దాదాపు ఐదు కోట్ల వరకు చెబుతున్నారట. సమంత మీద అన్ని కోట్లు అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ ఐదు కోట్లు అనే మార్జిన్ తగ్గుతుందా? పెరుగుతుందా? అన్నది చూడాలి. ఇప్పటికి అయితే చర్చలు నడుస్తున్నాయట.
ఈ ప్రాజెక్టు వెనకాల ఫ్యామిలీ మెన్ ఫేమ్ రాజ్ నిడిమోరు ఉన్నాడు కాబట్టి సబ్జెక్ట్ గురించి ఎవ్వరూ సందేహ పడటం లేదు. ఇక సమంత ఉంటే మినిమం గ్యారెంటీ వసూళ్లు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లకు కూడా తెలుసు. అందుకే సమంత బంగారం మూవీని కొనేందుకు అందరూ ఆసక్తిని చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Also Read- February astrology: వచ్చే నెలలో ఒకే రాశిలోకి 4 గ్రహాలు..ఈ రాశుల వారికి

