Maa Inti Bangaram: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సమంత సొంత ప్రొడక్షన్ ట్రాలాలా బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేశారు. ఫుల్ పెళ్లి వేడుక నేపథ్యంలో సాగిన ఈ పాటలో అందరూ ఫీమేల్ నటీమణలు ఉండటం విశేషం.
తస్సాదియ్యా.. అదిరిందయ్యా
‘తస్సాదియ్యా… తగ్గేదీ లేదు హొయ్య. అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే’ అంటూ ఈ పాట బాగా ఆకట్టుకుటుంది. ఇందులో సామ్ పెళ్లయిన మహిళ పాత్రలో కనిపించింది. చీరకట్టు డ్యాన్స్ చేస్తూ ఆకట్టకుంది. రెహమాన్ రాసిన ఈ పాటను చిన్మయి, పుణ్య సెల్వ పాడిన ఈ పాటకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.
ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ సాంగ్ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం మే 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇందులో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. సీనియర్ నటి గౌతమి, దిగంత్, గుల్షన్ దేవయ్య, మంజుషా, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు కథ అందించడం విశేషం.
Also Read: Kangana Ranaut: తను స్పెషల్.. దీపికా వర్కింగ్ అవర్స్‌పై కంగనా రియాక్షన్!

