Maa Inti Bangaram Teaser: యాక్షన్ రోల్‌తో అభిమానులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది సమంత. ఆమె హీరోయిన్‌గా నటించిన మా ఇంటి బంగారం టీజర్ శుక్రవారం రిలీజైంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. పెద్ద ఇంటిలోకి అడుగుపెట్టిన కొత్త కోడలిగా ఈ టీజర్‌లో సమంత కనిపించింది. అత్తింటి వారిని ఇంప్రెస్ చేయడానికి ఆమె పడే పాట్లు, వారంతా ఆమెపై వేసే సెటైర్లతో ఫన్నీగా టీజర్ మొదలైంది. ఆ తర్వాత సడెన్‌గా యాక్షన్ మోడ్‌లోకి ఎంటర్ కావడం ఆసక్తిని పంచింది. బస్‌లోని విలన్లను చితక్కొడుతూ సమంత కనిపించింది. ఆ తర్వాత తన ఇంట్లోనూ అడుగుపెట్టిన వారిపై ఎటాక్ చేయడం, ఆ శవాలను మాయం చేయడానికి ప్రయత్నం చేస్తుండగా… కుటుంబసభ్యుల కంటపడ్డట్టుగా చూపించే సీన్‌తో టీజర్‌ను ఎండ్ చేశారు. యాక్షన్ సీన్స్‌లో సమంత అదరగొట్టేసింది. టీజర్ చూస్తుంటే సమంత క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో సాగబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా టీజర్‌కు సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పింది.
మా ఇంటి బంగారం మూవీకి సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా భర్తతో కలిసి సమంత ఈ సినిమాను నిర్మిస్తోంది. మా ఇంటి బంగారం మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జబర్ధస్థ్, ఓ మై బేబీ తర్వాత సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది.
Also Read – RajaSaab Part2: ప్రభాస్ రాజాసాబ్ సీక్వెల్ కన్ఫామ్ – టైటిల్ ఇదే
కాంతర ఫేమ్ గుల్షన్ దేవయ్యతో పాటు దిగంత్, ఆనంద్, శ్రీముఖి, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఖుషి తర్వాత మయోసైటిస్ కారణంగా రెండేళ్లకుపైగా సినిమాలకు గ్యాప్ తీసుకున్న సమంత ఈ సినిమాతో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తోంది. మా ఇంటి బంగారం కంటే ముందు శుభం సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. ఈ హారర్ కామెడీ మూవీని సమంతనే స్వయంగా నిర్మించింది. నిర్మాతగా ఆమెకు ఈ మూవీ మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది.
గత ఏడాది డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో వీరి వివాహం జరిగింది. సమంతతో పాటు రాజ్ నిడిమోరు ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
Also Read – The Raja Saab Review : ‘ది రాజా సాబ్’తో ప్రభాస్ నవ్వించాడా? లేక భయపెట్టాడా?

