ఇటీవల కాలంలో సమంత నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తెలుగులో సినిమాలు చేయకపోయినా.. సౌత్ ఇండియాలో సమంత క్రేజీ తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా చేరువైంది సామ్. మరోవైపు చాలా కాలంగా మీడియాకు కూడా దూరంగా ఉంటున్న సామ్.. ఈ మధ్యే తిరిగి యాక్టీవ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా సమంత పెట్టిన ఓ పోస్ట్.. ఆమె రెండో పెళ్లికి సిద్ధమైనట్టే అని హింట్స్ ఇస్తున్నాయి.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్ గానే ఉంటున్న సమంత, రీసెంట్ గా మరోసారి ప్రేమలో పడిందనే వార్తలు చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఇద్దరూ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సమంత పెట్టిన ఓ పోస్ట్, ఆమె రెండో పెళ్లిపై అనుమానాలు రెట్టింపు చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత భావాలను పంచుకోవడంలో ఎప్పుడూ వెనుకాడని సమంత.. తాజాగా షాకింగ్ పోస్ట్ చేసింది.
“If I lose my shit, promise not to laugh / If I throw a fit and get photographed / Would you take my side? Would you hold my hand?” అంటూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిన్ను ప్రేమించాలంటే భయమేస్తోంది, జీవితాంతం నా చెయ్యి పట్టుకొనే ఉంటావా..? అనే అర్ధం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది.
దీని బట్టి చూస్తే సమంత రెండో వివాహం విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివాహం విషయంలో బాధల్లో పడ్డ సమంత.. మరోసారి అలాంటి బాధ అనుభవించేందుకు సిద్ధంగా లేను అనే అర్ధంలో ఈ పోస్ట్ చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే సమంతం రెండో వివాహం చేసుకుంటుందా.. లేక మరేదైనా కారణం వల్ల ఈ పోస్ట్ చేసిందో తెలియాలి.