Maa Inti Bangaram: హీరోయిన్‌గా సమంత నెక్స్ట్ మూవీ ఏదన్నది తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. కథానాయికగా చివరగా విజయ్ దేవరకొండ ఖుషిలో కనిపించింది సమంత. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఖుషి రిలీజై రెండేళ్లు అయినా కొత్త సినిమాపై సంతకం చేయలేదు సామ్. ఇటీవలే శుభం మూవీలో గెస్ట్ పాత్రలో తళుక్కున మెరిసింది. ఈ హారర్ కామెడీ మూవీతోనే ప్రొడ్యూసర్‌గా ఫస్ట్ సక్సెస్‌ను అందుకుంది.
మా ఇంటి బంగారం…
గత ఏడాది తన బర్త్‌డే సందర్భంగా మా ఇంటి బంగారం పేరుతో ఓ మూవీని అనౌన్స్ చేసింది సమంత. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాను ప్రకటించి ఏడాది దాటినా షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. మా ఇంటి బంగారం సినిమాను సామ్ పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది.
Also Read – Konaseema: అన్నంలో గ్లాసు ముక్కలు, కుళ్లిన కూరలు.. హాస్టల్ విద్యార్థుల ఆందోళన కోనసీమలో దారుణం
నందిని రెడ్డి దర్శకత్వంలో…
ఈ సినిమా ఆగిపోలేదట. అలా మొదలైంది ఫేమ్ నందినిరెడ్డి దర్శకత్వంలో త్వరలోనే మా ఇంటి బంగారం సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సమంత సన్నాహాలు చేస్తుందట. తొలుత ఓ తమిళ దర్శకుడితో ఈ సినిమా చేయాలని సామ్ అనుకుందట. అనివార్య కారణాల వల్ల అతడి స్థానంలో నందినిరెడ్డిని డైరెక్టర్‌గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా మా ఇంటి బంగారం సినిమా ఉండబోతుందని అంటున్నారు. కథ మొత్తం 1980 బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందట. ఇందులో సమంత క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని అంటున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సమంత, నందినిరెడ్డి కాంబినేషన్‌లో జబర్ధస్థ్‌తో పాటు బేబీ సినిమాలు వచ్చాయి. జబర్ధస్థ్ ఫ్లాపవ్వగా… బేబీ కమర్షియల్‌గా హిట్టైంది.
హిందీలో వెబ్ సిరీస్…
తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత హిందీలో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ హారర్ వెబ్ సిరీస్‌లో సమంతతో పాటు కునాల్ కపూర్, అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్, డీకే ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
డైరెక్టర్‌తో ప్రేమాయణం…
కాగా ఫ్యామిలీమ్యాన్ దర్శకుల్లో ఒకరైన రాజ్‌తో సమంత ప్రేమలో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల వీరిద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తానా ఉత్సవాల కోసం ఇటీవల అమెరికా వెళ్లింది సమంత. ఈ ట్రిప్‌కు సమంతతో పాటు రాజ్ కూడా వెళ్లాడు.
Also Read – Viral News:ఏందిరా సామి..అది పామానుకున్నావా..తాడానుకున్నావా..!

