Homeచిత్ర ప్రభSamuthirakani: బాధతోనే అలా అన్నాను.. విజయ్‌ త్రిషలపై కామెంట్స్‌పై సముద్రఖని వివరణ

Samuthirakani: బాధతోనే అలా అన్నాను.. విజయ్‌ త్రిషలపై కామెంట్స్‌పై సముద్రఖని వివరణ

Samuthirakani: తమిళ స్టార్‌ హీరో, టీవీకే అధినేత విజయ్‌, నటి త్రిషలపై నటుడు, దర్శకుడు సముద్ర ఖని చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో వివాదంగా మారాయి. వారిద్దరి కలిసి ఓ పెళ్లికి హాజరవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదేమైనా ఆటలా ఉందా.. ఇంత జరుగుతున్న కూడా ఆమెను ఎందుకు బయటకు తీసుకొస్తారు? నాలుగు గోడల మధ్య ఉంచుకోవచ్చు కదా? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

కావాలనే పెద్దది చేశారు
ఇవి తమిళనాట తీవ్ర దుమారం రేపాయి. తన వ్యాఖ్యల వివాదంపై తాజాగా ఆయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఆయన నటించిన ‘కార్మేని సెల్వం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భందా విజయ్‌ వివాదంపై స్పందించారు. విజయ్‌పై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భానికి సంబంధం లేకుండా వాటిని వక్రీకరించారన్నారు. తాను నిజాయితీగా మాట్లాడానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన ఆలోచనలను వ్యక్తం చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేశారని పేర్కొన్నారు.

‘గతంలో నేను మాట్లాడుతుండగా ఓ వ్యక్తి మొదటి నుంచి కాకుండా మధ్యలో వీడియో రికార్డ్‌ చేశారు. తను రికార్డ్‌ చేస్తున్నాడు అని తెలిసిన నేను మాట్లాడటం ఆపలేదు. విజయ్‌కి మొదట సపోర్ట్‌ ఇచ్చింది నేనే. కాబట్టే కాస్త నాకు బాధగా ఉంటుంది. ఆ పెయిన్‌తోనే నేను అలా అన్నాను. అవి నేను ఆయన మంచిని ఉద్దేశించి మాత్రమే చేశాను’ అని చెప్పుకొచ్చారు. విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టు పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయనకు ఓ నటితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయంలో తరచూ తమ మధ్య గొడవలు వచ్చేవన్నారు.

Also Read: Viral girl Monalisa: సనోజ్ మిశ్రాపై మోనాలిసా లైంగిక ఆరోపలు.. షాకిచ్చిన డైరెక్టర్‌!

అసలేం జరిగిందంటే..
తనతో మాట్లాడటం తగ్గిస్తానని తరచూ చెప్పేవారని, కానీ.. ఆయన ఎప్పుడు తన మాట నిలబెట్టుకోలేదన్నారు. మేము కలిసి ఉన్న మానసికంగా మేమిద్దరం ఎప్పుడో విడిపోయామని ఆమె బయటపెట్టారు. ఆమె ఈ ఆరోపణలు చేసిన కొన్ని రోజులకే విజయ్‌.. త్రిషతో కలిసి చెన్నైలో జరిగిన నిర్మాత కొడుకు పెళ్లి ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఇద్దరు ఒకే కారులోంచి దిగడం తమిళ తీవ్ర దుమారం రేపింది. దీనిపై నెటిజన్స్‌, ఇండస్ట్రీ వర్గాల రకరకాలు స్పందించారు. కొందరు వారికి మద్దతు ఇస్తుంటే.. మరికొందరు విజయ్‌ తీరుని వ్యతిరేకించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News