Raakaasaa: నటి, నిర్మాత నిహారిక కొణిదెల నిర్మాతగా 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’తో ఘన విజయాన్ని అందుకుని, తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడామె మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
జీ స్టూడియోస్ సమర్పణలో, నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై, నిర్మాత ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read – Telangana: తెలంగాణలో ‘ది రాజా సాబ్’ టికెట్ బుకింగ్స్ ఆలస్యం… ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన
‘రాకాస’ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న సంగీత్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సంగీత్ సోలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. నిహారిక నిర్మించిన వెబ్ ప్రాజెక్ట్స్‌తో ఇప్పటికే సంగీత్ శోభన్, మానస శర్మకు మంచి అనుబంధం ఉంది. జీ5 కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించగా, దానికి మానస శర్మ రైటర్ పనిచేశారు. ఆ తర్వాత మానస శర్మ సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్‌కు దర్శకురాలిగా వ్యవహరించారు. ఇప్పుడు ‘రాకాస’తో ఆమె ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
Born under the eclipse 🌑
Truth or Myth?
You’ll know soon..
Until then, stay curious.#Pep2 is now #RAAKAASAA 💥@IamNiharikaK #SangeethShobhan #NayanSarika #ManasaSharma #MaheshUppala @vennelakishore @AshishVid @getupsrinu3 #Bharani @anudeepdev @eduroluraju @anwaraliedit pic.twitter.com/4msR0g59S4— Pink Elephant Pictures (@PinkElephant_P) January 8, 2026
“సంగీత్ శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న మా చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఇది ఒక ఫాంటసీ కామెడీ చిత్రం. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక పాటతో పాటు నాలుగు రోజుల టాకీ పార్ట్ మాత్రమే చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి, సమ్మర్ కానుకగా ఏప్రిల్ 3న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని నిర్మాతలు అన్నారు.
ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫాంటసీ కామెడీ నేపథ్యంతో రూపొందుతున్న ‘రాకాస’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.

