Saturday, February 14, 2026
Homeచిత్ర ప్రభ2027 Sankranthi: 2027 సంక్రాంతి బెర్తులు క‌న్ఫామ్ - బాక్సాఫీస్ బ‌రిలో సీనియ‌ర్ స్టార్స్‌

2027 Sankranthi: 2027 సంక్రాంతి బెర్తులు క‌న్ఫామ్ – బాక్సాఫీస్ బ‌రిలో సీనియ‌ర్ స్టార్స్‌

2027 Sankranthi: ఏడాది ముందుగానే 2027 సంక్రాంతికి రిలీజ‌య్యే సినిమాలు ఏవ‌న్న‌ది తేలిపోయింది. ఈ సారి సంక్రాంతి బెర్తుల‌ను సీనియ‌ర్ హీరోలు ద‌క్కించుకున్నారు. ఫ‌స్ట్ టైమ్ పండుగ‌కు బాక్సాఫీస్ వ‌ద్ద చిరంజీవి, వెంక‌టేష్, బాల‌కృష్ణ సినిమాలు పోటీప‌డ‌బోతున్నాయి. ఈ ముగ్గురు హీరోల మ‌ధ్య పోరుతో వ‌చ్చే ఏడాది సంక్రాంతి స్పెష‌ల్‌గా ఉండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది

- Advertisement -

చిరంజీవి – బాబీ మూవీ
వాల్తేర్ వీర‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో ఓ యాక్ష‌న్ మూవీ రాబోతుంది. శాండ‌ల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నున్న ఈ సినిమాలో మోహ‌న్‌లాల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ట‌. ప్రియ‌మ‌ణి, కృతిశెట్టి లీడ్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో చిరు, బాబీ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకొని మేక‌ర్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఓపెనింగ్ ఈవెంట్ రోజే సంక్రాంతి రిలీజ్‌పై అఫీషియ‌ల్‌ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.

Also Read- The India House: టాలీవుడ్‌లోకి ధురంధ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంట్రీ – మెగా ఛాన్స్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

వెంక‌టేష్, అనిల్ రావిపూడి సినిమా…
అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా అచ్చొచ్చింది. సంక్రాంతికి వ‌స్తున్నాం, మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌ గారుతో వ‌రుస‌గా రెండు సార్లు సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచాడు. మూడోసారి సంక్రాంతి బ‌రిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌ గారు త‌ర్వాత త‌న నెక్స్ట్ మూవీని విక్ట‌రీ వెంక‌టేష్‌తో చేయ‌బోతున్నారు అనిల్ రావిపూడి. ఓవ‌రాల్‌గా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఐదో మూవీ ఇది. త‌న‌దైన మార్కు ఫ్యామిలీ కామెడీ క‌థ‌తోనే అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా క‌న్ఫామ్ అయిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. వెంకీ, అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతికే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంద‌ట‌.

బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని…
బాల‌కృష్ణ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ కూడా సంక్రాంతికే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం. తొలుత హిస్టారిక‌ల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చేయాల‌ని అనుకున్నారు. ఓవ‌ర్ బ‌డ్జెట్ కార‌ణంగా స్క్రిప్ట్‌లో ఛేంజెస్ చేశారు. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీగా బాల‌కృష్ణ, గోపీచంద్ మ‌లినేని మూవీ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంద‌ని అంటున్నారు. పెద్ది ప్రొడ్యూస‌ర్ వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read- Rakul Preet Singh: పెళ్లి తర్వాత కూడా తగ్గని రకుల్ గ్లామర్.. వైరల్ గా మారిన లేటెస్ట్ ఫొటోస్!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News