Thursday, January 23, 2025
Homeచిత్ర ప్రభSankranthiki Vasthunnam: వెంకటేశ్ శాంభవం.. తొమ్మిది రోజులు కలెక్షన్స్ ఎంతంటే..?

Sankranthiki Vasthunnam: వెంకటేశ్ శాంభవం.. తొమ్మిది రోజులు కలెక్షన్స్ ఎంతంటే..?

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam)మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. తొలి రోజు నుంచే థియేటర్‌లో హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తోన్న ఈ చిత్రం ఇప్ప‌టికే రూ.200 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఇక తొమ్మిది రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.230కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించినట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. ఈ చిత్రం తొలి రోజు ఏకంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో వెంకటేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

- Advertisement -

ఇక ఈ మూవీలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్‌లు హీరోయిన్స్‌గా న‌టించ‌గా..వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News