Thursday, January 22, 2026
Homeచిత్ర ప్రభSankranti 2026 Movies: సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు!

Sankranti 2026 Movies: సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు!

Sankranti 2026 Movies: సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌కి పండగ వైబ్స్ ఆన్. ఆడియన్స్ అంతా ఫ్యామిలీస్‌తో థియేటర్స్‌ని ఫంక్షన్ హాల్స్ లా మార్చేస్తారు. అలాంటి పీక్ సీజన్‌లో కేవలం ఒక్క బ్లాక్‌బస్టర్ పడితే చాలు, కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కానీ ఈసారి, 2026 సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఈ రేస్‌లో నిలబడాలంటే సినిమా కంటెంట్ ఒక్కటే కాదు, ప్రమోషన్ స్ట్రాటజీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి.

- Advertisement -

మెగాస్టార్ Vs డార్లింగ్

ఈ సంక్రాంతి రేస్‌లో మెయిన్ ఫైట్ అంతా ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ మధ్యే!
ముందుగా, లాస్ట్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఇచ్చిన అనిల్ రావిపూడి, ఈసారి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ వస్తున్నారు. (రిలీజ్: జనవరి 12). పోటీ హెవీగా ఉంది కాబట్టి, అనిల్ రావిపూడి తన సంక్రాంతి సేఫ్‌గేమ్ చాలా తెలివిగా ఆడుతున్నాడు. అందుకే, సినిమాలో వెంకీ కామియో ప్లాన్ చేశాడు. ఇంకెన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

మరోవైపు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ది రాజ్ సాబ్ (రిలీజ్: జనవరి 9) తో పండగ కంటే ముందే ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ లుక్, ట్రైలర్ అన్నీ వింటేజ్ ప్రభాస్ వైబ్స్‌ని ఇస్తున్నాయి. ‘బుజ్జిగాడు’ తర్వాత ఆ ఎనర్జీని ఫ్యాన్స్ మిస్ అయ్యారు. మారుతి గనుక అందులో సగం మ్యాజిక్ చూపించినా, ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం.

ALSO READ: 3 Idiots Sequel: 17 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న ‘3 ఇడియట్స్’ గ్యాంగ్!

కామెడీ & కంటెంట్ కింగ్స్

ఈ బిగ్గెస్ట్ క్లాష్ మధ్య, ఇద్దరు టాలెంటెడ్ హీరోలు తమ సినిమాలతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ‘మిస్ శెట్టి..’ తో కొంచెం డీలా పడ్డ నవీన్ పోలిశెట్టి, తన కంఫర్ట్ జోన్ అయిన కామెడీ ఎంటర్‌టైనర్ తో అనగనగ ఒక రాజు గా వస్తున్నాడు. కంటెంట్ కొంచెం క్లిక్ అయినా, మిగిలిందంతా నవీన్ తన కామెడీ టైమింగ్‌తో లాక్కొస్తాడు. ఆంధ్రా స్లాంగ్లో ఈసారి ఎలాంటి కథ చెప్తాడో చూడాలి.

అలాగే, శర్వానంద్ నటిస్తున్న నారి నారి నడుమ మురారి పరిస్థితి మాత్రం కొంచెం డౌటే. ఒకప్పుడు ‘శతమానం భవతి’ తో సంక్రాంతికి క్రేజ్ సంపాదించిన శర్వాకు, ఇప్పుడు సినిమా వస్తుందన్న బజ్ కూడా లేదు. ప్రమోషన్స్ జీరో. ఇలాంటి హెవీ కాంపిటీషన్‌లో, ఆల్రెడీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటే, ఈ సినిమా రేసులో నిలబడాలంటే ఏదో ఒక బిగ్ మూవ్ చేయాల్సిందే.

మాస్ రాజాపై ప్రెజర్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుముల డైరెక్షన్‌లో వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాపై ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ తగ్గింది. ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న కథలు, రొటీన్ యాక్టింగ్.. ఇవన్నీ ఆడియన్స్ ని థియేటర్స్ వైపు లాగలేకపోతున్నాయి. ఈ మూవీ గ్లింప్స్ కూడా పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఈ సంక్రాంతికి పోటీ చాలా ఎక్కువ కాబట్టి, రవితేజ ఏంటో చూపించేలా రాబోయే ట్రైలర్, సాంగ్స్ ఉండాలి. లేదంటే, ఈ రేస్‌లో చాలా కష్టపడాల్సి వస్తుంది.

ALSO READ: Akhira Nandan: అకీరా నందన్ AI మూవీ యూట్యూబ్ లో సంచలనం!

ఇది ప్రమోషన్స్ టైమ్

ప్రస్తుతానికి, రేసులో ది రాజ్ సాబ్, మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలకే హైయెస్ట్ అంచనాలు ఉన్నాయి. కానీ, ఐదు సినిమాలు ఉండటం అంటే థియేటర్ల సమస్య కూడా తప్పదు. ఈ సమయంలో, మిగిలిన సినిమాలు అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి టీమ్స్ టైమ్ వేస్ట్ చేయకుండా, ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తేనే ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేయగలుగుతాయి. లేదంటే, పెద్ద సినిమాల వైబ్‌లో ఈ మూడు కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News