Sunday, November 10, 2024
Homeచిత్ర ప్రభSaripoda Sanivaram review: వెరైటీ స్టోరీ లైన్ తో ఆకట్టుకుంటున్న 'సరిపోదా శనివారం'

Saripoda Sanivaram review: వెరైటీ స్టోరీ లైన్ తో ఆకట్టుకుంటున్న ‘సరిపోదా శనివారం’

సరిపోదా శనివారం : మూవీ రివ్యూ:
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె.సూర్య, సాయికుమార్, అభిరామి, విష్ణు తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: మురళి జి
ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు : డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

- Advertisement -

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘సరిపోదా శనివారం’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా SJ సూర్య నెగిటివ్ రోల్ చేశాడు.
కథ: సూర్య (నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. కోపం వచ్చిన మరుక్షణమే కొట్టడానికి వెళ్తుంటాడు. కొడుకు కోపాన్ని చూసిన తల్లి ఛాయాదేవి (అభిరామి) వారంలో ఒక్కరోజు మాత్రమే కోపం చూపించాలని ఒట్టు వేయించుకుని చనిపోతుంది. ఆ రోజు శనివారం అవుతుంది. అలా అప్పట్నుంచి వారం అంతా కోపం వచ్చిన వాళ్ల పేర్లు బుక్కులో రాసుకుని.. శనివారం వరకు నిజంగా ఆ కోపం అలాగే కంటిన్యూ అయితే వెళ్లి కొడతాడు. అలా సూర్య కొట్టిన వాళ్ల నుంచి అతడి తండ్రి (సాయి కుమార్)తో పాటు అక్కకు కూడా సమస్యలు వస్తుంటాయి. దాంతో అక్క పెళ్లి చేసుకున్నా వీళ్లకు దూరంగానే ఉంటుంది. వాళ్ళ అక్క పెళ్ళిలో అక్కకి కాబోయే మామయ్యని తన శనివారం కోపంతో కొట్టి గొడవ పెట్టుకోవడంతో అక్క సూర్యకు దూరంగా ఉంటుంది. దయానంద్(SJ సూర్య) రాక్షసుడి లాంటి పోలీస్. వాళ్ళ అన్న కూర్మానంద్(మురళి శర్మ) తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వట్లేదని అతని మీద కోపం సోకులపాలెంలోని అమాయక ప్రజల మీద చూపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు నేరాలు చేసి బతికిన ఊరు మారినా తన అన్నని రాజకీయాల్లో గెలిపించినందుకు దయానంద్ వాళ్లపై విరుచుకుపడుతూ ఉంటాడు. దయానంద్ స్టేషన్ లో చారులత(ప్రియాంక మోహన్)కొత్తగా లేడీ కానిస్టేబుల్ గా చేరుతుంది. అనుకోకుండా ఓ రోజు దయానంద్ కోపం వల్ల సూర్యతో పరిచయం ఏర్పడుతుంది. అసలు సూర్య శనివారం మాత్రమే కోపం చూపించడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? సూర్య – చారులతలు ప్రేమలో పడతారా? సూర్య అక్క తమ్ముడికి మళ్ళీ దగ్గరైందా? సూర్య చిన్నప్పటి మరదల్ని కలుస్తాడా? కూర్మానంద్ తన తమ్ముడికి ఆస్తిని ఇస్తాడా? అసలు దయానంద్ గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటర్ అయ్యాడు? సోకులపాలెం ప్రజల్ని సూర్య ఎలా కాపాడాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. సాధారణంగా నాని రెగ్యులర్ కథలే చేసినా వాటిల్లో ఏదో కొత్తదనం చూపిస్తాడు. ఇప్పుడు సరిపోదా శనివారంలోను అదే చేసాడు. ఓ హీరో.. హీరోయిన్ వల్ల ఒక ఏరియాలోని ప్రజల కోసం నిలబడటం అనే రెగ్యులర్ కథని అమ్మ ఎమోషన్, శనివారం మాత్రమే తన కోపం చూపించడం అనే పాయింట్స్ తో కొత్తగా సరిపోదా శనివారంలో చూపించారు.

ప్లస్ పాయింట్స్ :
ఈ సరిపోదా శనివారం సినిమాలో నాని చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ నాని మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. నాని నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన నేచురల్ లుక్స్ తో నాని సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ప్రియాంక అరుల్ మోహన్ తో సాగిన లవ్ స్టోరీలోనూ నాని తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.
హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన ఎస్.జె.సూర్య కూడా మెప్పించాడు.

మైనస్ పాయింట్స్ :
నాని పోషించిన సూర్య పాత్రను, ఆ పాత్ర తాలూకు మదర్ సెంటిమెంట్ మరియు కోపాన్ని, ఆ కోపాన్ని చూపించే శనివారాన్ని బాగా డిజైన్ చేసుకున్న వివేక్, కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈ ‘సరిపోదా శనివారం’ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు.

మొత్తంగా ‘సరిపోదా శనివారం’ ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News