Tuesday, April 15, 2025
Homeచిత్ర ప్రభత్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన సత్యరాజ్..!

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన సత్యరాజ్..!

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అందరినీ అలరించారు. సౌత్‌లో సత్యరాజ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సత్యరాజ్ చేతి నిండా ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు పోటీ అనేట్టుగా పని చేస్తున్నారు. అంతేకాదు సినిమాని ప్రమోట్ చేయడంలోనూ పోటీ పడుతున్నారు సత్యరాజ్.

- Advertisement -

సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ అలరించింది. పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు సత్యరాజ్.

‘అనగ అనగ కథలా’ అనే పాట ఈ మధ్య రిలీజ్ అయి యూట్యూబ్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాత, మనవరాలి మధ్య ఉండే బాండింగ్‌ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట ప్రమోషన్స్‌లో భాగంగా సత్యరాజ్ రీల్స్ చేశారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హీరోయిన్లంతా కూడా రీల్స్ చేస్తుండగా.. సత్యరాజ్ సైతం ఈ ట్రెండ్‌లో పాల్గొన్నారు. త్రిబాణధారి బార్బరిక్ సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

తారాగణం: సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్, మరియు మేఘన

సాంకేతిక సిబ్బంది:
రచన , దర్శకత్వం :మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయపాల్ రెడ్డి అడిదాల
సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
డిఓపి : కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం : ఇంఫ్యూజన్ బ్యాండ్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నా
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజీష్ నంబూరు
లైన్ ప్రొడ్యూసర్ : బి.ఎస్. రావు
ఫైట్స్ : రామ్ సుంకర
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
PRO : సాయి సతీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News