Wednesday, March 26, 2025
Homeచిత్ర ప్రభSeethannapeta Gate: సీతన్నపేట గేట్.. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఏప్రిల్ 4న గ్రాండ్ రిలీజ్..!

Seethannapeta Gate: సీతన్నపేట గేట్.. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఏప్రిల్ 4న గ్రాండ్ రిలీజ్..!

సీతన్నపేట గేట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత ఆర్ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేణుగోపాల్, 8 పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. చిత్రానికి వై రాజ్ కుమార్ దర్శకుడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

- Advertisement -

మంగళవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రెస్ మీట్లో డైరెక్టర్ వై రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో చాలా మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయని, కాబట్టి ఈ సీతన్నపేట గేట్ సినిమాను వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించామని చెప్పారు. తెలుగు, కన్నడలో స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించిన ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంస్థలో మూవీ చేయడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో సీతన్నపేట గేట్ కథనం సాగుతుందని తెలిపారు.

డైరెక్టర్ వి. సముద్ర మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రొడక్షన్స్ చాల పెద్ద సంస్థ అని, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సీతన్నపేట గేట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. నిర్మాత శ్రీనివాస్‌గారు ఎన్నో చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేశారని అన్నారు. ఇక నిర్మాత ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమాలకు పెద్దా చిన్నా అనేది లేదని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. సీతన్నపేట గేట్ మంచి కంటెంట్‌తో మీ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు.

సీతన్నపేట గేట్ సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత శ్రీనివాస్‌గారికి, డైరెక్టర్ రాజ్ కుమార్‌గారికి ధన్యవాదాలని హీరో వేణుగోపాల్ తెలిపారు. మాస్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌లో కనిపించే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఇక ఈ కథ విన్నప్పుడు చాలా యూనిక్‌గా అనిపించిందని, మంచి మెసేజ్ కూడా కథలో ఉందని డైలాగ్ రైటర్ బయ్యవరపు రవి పేర్కొన్నారు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీతన్నపేట గేట్ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

నటీనటులు: వేణుగోపాల్, 8 పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి, యశ్వన్, గంగాధర్, సురభి తివారి, కస్లాయ్ చౌదరి, అనూష జైన్, సుదీక్ష ఝా, తదితరులు
సాంకేతిక బృందం
నిర్మాతలు – వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ (ఆర్. శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – వై రాజ్ కుమార్
పీఆర్ఓ – సురేష్ కొండేటి
మ్యూజిక్ – ఎన్ఎస్ ప్రసు
ఎడిటింగ్ – శివ శర్వాణి
డైలాగ్స్ – బయ్యవరపు రవి
లిరిక్స్ – భాస్కరభట్ల, మణికంఠ సంకు
యాక్షన్ – వింగ్ చున్ అంజి
కొరియోగ్రఫీ – అనీష్, జి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News