MohanBabu| మంచు కుటుంబం(Manchu Family)లో వివాదాలు తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు.. పరస్పర ఆరోపణలు.. మనోజ్(Manoj) వర్సెస్ మోహన్ బాబు, విష్ణు(Vishnu)ల మధ్య ఆస్తుల వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నాలుగు గోడల మధ్య జరగాల్సిన కుటుంబ సమస్యలు రోడ్డున పడ్డాయి. దీంతో పోలీసులు, మీడియా ఎంటర్ కావాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో నిగ్రహం కోల్పోయిన మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై దాడి చేయడం మరింత అగ్గి రాజేసింది. ఆయనను అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేయడంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబుతో పాటు మనోజ్ విష్ణుకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న లైసెన్స్ గన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే మోహన్‌బాబు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. బీపీ ఎక్కువ కావడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని.. అందుకే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఆయన రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరవుతారో లేదో అనే ఉత్కంఠ మొదలైంది