Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభChiranjeevi - Balakrishna: రూట్ మార్చిన సీనియర్ స్టార్స్

Chiranjeevi – Balakrishna: రూట్ మార్చిన సీనియర్ స్టార్స్

Venakatesh – Nagarjuna: మారుతున్న ట్రెండ్‌ను యంగ్ హీరోస్ మాత్రమే కాదండోయ్.. సీనియర్ స్టార్స్ కూడా ఫాలో అయిపోతున్నారు. రూట్ మార్చి నయా ట్రెండ్‌కు వెల్ కమ్ చెప్పేస్తున్నారు. ఈ మార్పులో ముందు అడుగు సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్. వరుస ఫ్లాప్‌లతో విసిగిపోయిన వెంకీ, మొహమాటం లేకుండా ‘రానా నాయుడు’తో ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ఏదైనా సరే ముందుగా వెంకీ చేతుల మీదుగానే మొదలవుతుంది అన్నట్టుగా, మల్టీస్టారర్ మూవీస్‌కు కూడా మళ్ళీ ఊపిరి పోశాడు. మహేష్‌తో కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు’ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ‘ప్రేమ’ మూవీలో ఆయన ఇచ్చిన గెస్ట్ అపీరెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. వయసుతో పాటు అనుభవంతో ఎవరైనా మారాల్సిందే అన్న సత్యాన్ని మన సీనియర్లలో వెంకటేష్ ముందుగా గ్రహించాడు.

- Advertisement -

మారే ట్రెండ్‌ను ఒడిసి పట్టుకోవటంలో కింగ్ నాగార్జున ఎఫ్పుడూ ముందుంటారు. ‘బంగారురాజు’ తర్వాత హీరోగా వరుస ఫ్లాప్‌లు చూడటంతో నాగ్ కూడా విసిగిపోయాడు. అందుకే, తానొక్కడే హీరోగా కాకుండా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లతో కలిసి ‘నా సామిరంగా’ చేసి సక్సెస్ చూశాడు. ఆ సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర దాటినా హీరోగా మరో మూవీ చేయకుండా, ఏజ్‌కు తగ్గ కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈలోగా, ‘కుబేర’లో ఒక గుర్తుండిపోయే పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. ‘కుబేర’ రిలీజ్ తర్వాత నాగ్ రోల్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇందులో నాగ్ ‘దీపక్’ అనే నెగిటివ్ టచ్ ఉన్న రోల్‌లో కనిపించాడు. దీపక్ క్యారెక్టర్ పాజిటివ్ వేవ్‌తో కనిపించి మధ్యలో నెగిటివ్‌గా మారి, చివర్లో మళ్ళీ పాజిటివ్ టచ్ ఇచ్చి కథను నడిపాడు.

కుబేర చిత్రం కోసమే కాదండోయ్.. రజినీకాంత్ ‘కూలీ’లో వచ్చిన విలన్ రోల్‌ను ఓకే చేసేసాడు. ‘కూలీ’ పాన్ ఇండియాగా రిలీజ్ అయి హిట్ అయితే, నాగ్ కెరీర్‌కు మరో ‘యూటర్న్’ అవ్వడం పక్కా.
కుబేర సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి, నాగ్ పై ప్రశంసలు కురిపించాడు. ఆరోగ్యం ఏం జరిగినా లైట్ తీసుకోవడంలో నాగ్ తనకు ఆదర్శంగా నిలిచాడని అన్నాడు. నాగ్ స్ఫూర్తితో ఓటిటిలో నటించడానికి కూడా రెడీ అని అనౌన్స్ చేశాడు చిరంజీవి. ఓటిటిలో నటించడానికి తనకు అభ్యంతరం లేదని చిరంజీవి ఆల్రెడీ చెప్పేసాడు. అంటే, మెగాస్టార్ కూడా డిజిటల్ స్క్రీన్‌పై మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారన్న మాట.

నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే, తన 50 ఏళ్ల కెరీర్‌లో ఇంతవరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జోలికి వెళ్ళని బాలయ్య కూడా యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హీరోగా వరుసగా నాలుగు హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య, ‘అఖండ 2’ తర్వాత గోపీచంద్ మలినేని మూవీతో పాటు మరో సినిమా లైన్‌లో పెట్టాడు. అయితే, ‘జైలర్ 2’ లో గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే, మన సీనియర్స్ అందరూ మారినట్టే లెక్క. రొటీన్‌కు గుడ్ బై చెప్పకపోతే, కనుమరుగయ్యే ఛాన్స్ ఉందని సీనియర్స్‌కి అర్థమైంది. అందుకనే మన సీనియర్ స్టార్స్ రూట్ మార్చి సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇది తెలుగు సినిమాకు ఒక శుభపరిణామం అనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News