Thursday, December 26, 2024
Homeచిత్ర ప్రభNTR: ఎన్టీఆర్‌పై సంచలన ఆరోపణలు.. టాలీవుడ్ నటి తీవ్ర ఆగ్రహం

NTR: ఎన్టీఆర్‌పై సంచలన ఆరోపణలు.. టాలీవుడ్ నటి తీవ్ర ఆగ్రహం

కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. గతంలో ఎన్టీఆర్(NTR) వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్‌తో పోరాడుతుండగా.. అతడి కోరిక మేరకు తారక్ వీడియో కాల్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతని చికిత్సకు సాయం అందిస్తానని కౌశిక్ తల్లికి మాటిచ్చారు. అయితే ఎన్టీఆర్ తన మాట నిలబెబ్లుకోలేదని.. తమకు రూపాయి కూడా సాయం చేయలేదని కౌశిక్ తల్లి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

తాజాగా ఈ వీడియోపై టాలీవుడ్ నటి మాధవీలత(Maadhavilatha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అయితే ఏం చేద్దాం. ఈ రకంగా ఫ్యాన్స్‌కి డబ్బలిస్తూ పోతే హీరోలు రోడ్డు మీద పడి అడుక్కుతింటారు. అభిమాని అంటే ఆశించేవాడు కాదు అందుకే అభిమాని అంటారు. ఒక మాట మాట్లాడితే మురిసిపోయేది అభిమానం. ఆశిస్తే స్వార్థం అవుద్ది కానీ అభిమానం ఎలా అవుతుంది..? ఇంకా రోజుకొకరు వస్తారు బయటికి మాకు సాయం చేయమని. స్టోరీస్ పట్టుకుని ఫిల్మ్ నగర్‌లో చాలామంది తిరుగుతారు. అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది’’ అని ఆమె తెలిపారు. ప్రస్తుతం మాధవీలత పోస్ట్ నెట్టింట వైరల్ అవులోంది. దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతు చెబుతుండగా.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News