హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో మూడో రోజూ ఐటీ సోదాలు(IT Raids) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar), నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా, వృద్ధి సినిమాస్, ఇతర నిర్మాతల కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా ఈ ఐటీ సోదాలపై హీరో విక్టరీ వెంకటేశ్(Venkatesh) స్పందించారు. దిల్ రాజు నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రూ.230 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఐటీ రైడ్స్‌పై మీడియా ప్రతినిధులు అడగగా.. వెంకటేష్ స్పందిస్తూ ఐటీ దాడుల విషయం తనకు తెలియదన్నారు. అలాగే హీరోలు అందరూ రెమ్యూనరేషన్ బ్లాక్‌లో తీసుకుంటున్నారని.. అందుకే నిర్మాతలకు సమస్యలు అనే ప్రశ్నలపై మిగతా వాళ్ల గురించి తనకు తెలియదని.. తాను మాత్రం వైట్‌లోనే తీసుకుంటానని స్పష్టం చేశారు. తాను తీసుకునేది చాలా తక్కువని.. అది కూడా వైట్‌లోనే తీసుకుంటానని తెలిపారు.