Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభsequels season 2023: టాలీవుడ్ లో సీక్వెల్స్ ఫీవర్, బ్లాక్ బస్టర్స్ కు సీక్వెల్స్, ప్రీక్వెల్స్

sequels season 2023: టాలీవుడ్ లో సీక్వెల్స్ ఫీవర్, బ్లాక్ బస్టర్స్ కు సీక్వెల్స్, ప్రీక్వెల్స్

హాలీవుడ్ స్టైల్ లో మొన్నటివరకు బాలీవుడ్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ కు పాకింది. ఇది సక్సెస్ మంత్రాగానూ మారింది. బాగా హిట్ అయిన సినిమా ఫార్ములాను కొనసాగిస్తూ, ప్రీక్వెల్-సీక్వెల్స్ పేరుతో తీసి ఎంటర్ టైన్ చేస్తున్నారు డైరెక్టర్లు. ఇప్పటికే బాహుబలి, ఎఫ్-2 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. దీంతో మనవాళ్లకు సీక్వెల్స్ నచ్చుతున్నాయని టాలీవుడ్ ఫిక్స్ అయింది. దీంతో బోలెడన్ని సీక్వెల్స్, ప్రీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. 2023, 2024లో ఇలాంటి చాలా సిరీస్ రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే అఫిషియల్ గా అనౌన్స్ అయినదాని ప్రకారం జాతిరత్నాలు 2, హిట్ 2, గూఢాచారి 2, ఈ నగరానికి ఏమైంది 2, డీజే టిల్లు 2, ఢీ అండ్ ఢీ డబుల్ డోస్, బింబిసార 2,

- Advertisement -

RRR2, పుష్ప 2, కార్తికేయ 3 వంటి సినిమాలుండగా ఇంకా చాలా హిట్ సినిమాలు ఇలా సీక్వెల్స్ కు రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. వీటిలో చాలా సినిమాలు ప్యాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News