Rubina Dilaik: బుల్లితెర తారలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. వారు ఎక్కువగా బయటకు రాకపోవడం, బయట జనాలతో అంతగా ఇంటరాక్ట్ అవ్వకపోవడంతో వారికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా హిందీ బుల్లితెరపై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రుబీనా దిలైక్ శుభవార్త చెప్పి.. అందరిలోనూ అనుమానాల్ని రేకెత్తించింది. రెండో సారి ప్రెగ్నెంట్ అయిన ఈ రుబీనా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సీరియల్ హీరోయిన్ రుబీనా దిలైక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. తన భర్త అభినవ్ శుక్లాతో కలిసి ఇప్పటికే ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చిన రుబీనా.. తాజాగా తాను మళ్లీ గర్భవతినంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “నేను గర్భవతిని” అని ఆమె వేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో భర్తను ట్యాగ్ చేయకపోవడం, భర్తతో కలిసి ఫోటో దిగకపోవడంతో ఈ వార్త నిజమా? కాదా? అని అందరూ ఆలోచనల్లో పడ్డారు.
Also Read – Dhanush: కొడుకుని హీరోగా లాంఛ్ చేసే ప్రయత్నాల్లో ధనుష్?
“ఇది నిజమేనా?” అని ఒకరు కామెంట్ చేయగా.. “నాకెందుకో ఇది మనం అనుకుంటున్న ప్రెగ్నెన్సీ కాదనిపిస్తోంది, దీని వెనుక ఏదో మతలబు ఉంది” అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇదేమైనా ప్రమోషన్ కోసమా? పబ్లిసిటీ స్టంటా? అని ఇలా రకరకాల కామెంట్లతో ఆమె పోస్ట్ ఒక్కసారిగా వైరల్ కాసాగింది. రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా 2018 జూన్‌లో సిమ్లాలో వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లి అయిన చాలా కాలం తరువాత అంటే.. 2023 సెప్టెంబర్‌లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది డిసెంబర్ 27న తమకు కవల కుమార్తెలు జీవా, ఈధా జన్మించినట్లు వెల్లడించారు రుబీనా దంపతులు. అయితే ఇంతలోనే మళ్లీ ఇలాంటి ప్రకటన చేయడం, అందులోనూ భర్తను ట్యాగ్ చేయకపోవడంతో అందరూ ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read – Vikram K Kumar Story: నితిన్ కోసం రాసుకున్న కథలో విజయ్ దేవరకొండ?

