Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభShaakuntalam: ఏప్రిల్ 14న శాకుంతలం రిలీజ్

Shaakuntalam: ఏప్రిల్ 14న శాకుంతలం రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా శాకుతలం సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14న భారీ రిలీజ్ చేస్తున్నట్టు గుణశేఖర్ కుటుంబం వెల్లడించింది. అంతకుముందే పలుమార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం రిలీజ్ పోస్ట్ పోన్ పదేపదే కావటం సామ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఫిబ్రవరి 17న గ్రాండ్ రిలీజ్ కావాల్సిన శాకుంతలం ప్యాన్ ఇండియా మూవీ పోస్ట్ పోన్ కావటంతో సమంత ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. శాకుంతలం సినిమాకు మొదటి నుంచీ చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి దీంతో ఈ భారీ బడ్జెట్ సినిమా పలుమార్లు ఎన్నో అవాంతరాలకు గురవుతూ చివరికి రిలీజ్ విషయంలోనూ పదేపదే ఆలస్యం అవుతోంది.

- Advertisement -

ఈ పీరియడ్ డ్రామా రిలీజ్ ఆలస్యం కావటానికి పఠాన్ సినిమా హిట్ కావటమే కారణంగా తెలుస్తోంది. పఠాన్ థియేటర్స్ లో బ్రహ్మాండంగా ఆడుతున్న కారణంగా శాకుంతలం సినిమా హిందీ వర్షన్ రిలీజ్ కు థియేటర్స్ ప్రాబ్లెం అయింది. కావాల్సినన్ని థియేటర్స్ దొరకనందున శాకుంతలం సినిమా రిలీజ్ వాయిదా వేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు గుణశేఖర్ ఫ్యామిలీ తాజాగా రెడీ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News