Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభShahrukh Khan : ఆ గ్రేట్ లిస్ట్‌లో ఇండియా నుంచి షారుఖ్ ఒక్కడే..

Shahrukh Khan : ఆ గ్రేట్ లిస్ట్‌లో ఇండియా నుంచి షారుఖ్ ఒక్కడే..

shah rukh khan : బాలీవుడ్ కింగ్‌ఖాన్‌ షారుఖ్ కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ కి గురవుతున్నాడు. తను నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటూ సినీ, రాజకీయ వర్గాలు నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నాడు. ఈ సమస్యల మధ్య షారుఖ్ కి ఒక గుడ్ న్యూస్ వినిపించింది.

- Advertisement -

అదేంటంటే ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన యాక్టర్స్ జాబితాలో షారుఖ్ స్థానం దక్కించుకున్నాడు. ప్రముఖ బ్రిటిష్ మ్యాగజైన్ ఎంపైర్ ’50 గ్రేటెస్ట్ యాక్టర్స్ అఫ్ అల్ టైమ్’ లిస్ట్ ని ఈ మంగళవారం విడుదల చేసింది. అయితే ఇండియా తరుపు నుంచి ఈ జాబితాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒక్కడే స్థానం దక్కించుకోవడం విశేషం.

ఈ మ్యాగజైన్ లిస్ట్ లో కేవలం షారుఖ్ పేరుని మాత్రమే ప్రస్తావించడం కాకుండా అతను నటించిన సినిమాలు, అందులోని ఫేమస్ డైలాగ్స్ ని కూడా ప్రచురించడం విశేషం. అలాగే కింగ్‌ఖాన్‌ కి ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది ఎంపైర్. ఇక మ్యాగజైన్ ఆర్టికల్ చూసిన బాద్‌షా అభిమానులు.. ఏళ్ళు గడిచినా, సరైన హిట్టు లేకున్నా, ఏమాత్రం తగ్గని క్రేజ్ షారుఖ్ ఖాన్ సొంతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News