Thursday, January 15, 2026
Homeచిత్ర ప్రభShah Rukh Khan honeymoon: షారూఖ్, గౌరీల హనీమూన్ డెస్టినేషన్ ఏదో తెలుసా?

Shah Rukh Khan honeymoon: షారూఖ్, గౌరీల హనీమూన్ డెస్టినేషన్ ఏదో తెలుసా?

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ ఏం చేసినా ట్రెండ్ సెట్టర్ గా ఉంటారు. ఆయనకున్న ఫాలోయింగ్ ఆ రేంజ్ క్రేజ్ మరి. షారూఖ్ ఖాన్ తన క్లాస్మేట్ గౌరీని పెళ్లి చేసుకుని, ఆమెను హనీమూన్ కు ఎక్కడికి తీసుకెళ్లారని అడిగితే అందరూ ఏ ఫారిన్ లొకేషనో చెప్పేస్తారు. కానీ SRK, గౌరీఖాన్ ల హనీమూన్ డెస్టినేషన్ ఇండియాలోని మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ లో జరిగింది. వెస్ట్ బెంగాల్ లోని డార్జీలింగే వీరి హనీమూన్ స్పాట్. సరిగ్గా 30 ఏళ్ల క్రితం రాజూ బన్ గయా జెంటిల్మెన్ హిందీ సినిమా 1992లో షూటింగ్ జరుపుకుంటుండగా షారూక్ తన డ్రీమ్ గర్ల్ ను మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు. షారూఖ్-గౌరీతో పాటు ఈ సినిమా క్రూ మొత్తం డార్జీలింగ్ కు వెళ్లిందనేది మరింత ఆశ్చర్యకరమైన విషయం. మరో ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఏంటంటే వీరి హనీమూన్ ను ఈ సినిమా ప్రొడ్యూసర్సే స్పాన్సర్ చేశారు. ఈ సినిమాలో ఇంట్రడక్టరీ సీన్స్ ను డార్జీలింగ్ లోనే షూట్ చేశారు. చిల్లీ బ్రీజ్, లష్ గ్రీన్ టీ ఎస్టేట్స్, బెస్ట్ పనోరమిక్ వ్యూస్, కాంచనజంగా వ్యూ, కేబుల్ రైడ్స్, ఓపన్ ఎయిర్ కేఫ్స్, వల్డ్స్ బెస్ట్ టీ .. ఇలాంటి హైలైట్స్ ఎన్నో ఉన్న డార్జీలింగ్ మీరు చూశారా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News