Thursday, April 10, 2025
Homeచిత్ర ప్రభSharmila Tagore: ఇంటి అద్దె కట్టేందుకు యాక్ట్ చేశా

Sharmila Tagore: ఇంటి అద్దె కట్టేందుకు యాక్ట్ చేశా

నటులు కొన్ని సినిమాలు ఎందుకు నటిస్తారో కొన్ని సినిమాల్లో నటిస్తే ఎంత పారితోషికం ఇస్తామన్నా ఎందుకు వద్దంటారన్నది చాలాసార్లు బయటి ప్రపంచానికి తెలిసిరాదు. ఇదే విషయాన్ని అలనాటి నటి, ఇప్పటికీ విజయవంతంగా తన ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న షర్మిలా ఠాగూర్ వివరించారు. ఆమె మాటలు నిజానికి చాలా ఆసక్తిగా ఉండటంతో ఇప్పుడు అందరూ ఈమె వర్షన్ పై చర్చిస్తున్నారు.

- Advertisement -

వెటరన్ యాక్టర్ షర్మిల టాగూర్ 70, 80ల్లో కేవలం ఇంటి రెంట్ కట్టేందుకు కూడా తాను కొన్ని సినిమాలు ఓకే చేసినట్టు చెప్పుకొచ్చారు. పలు కారణాలతో ఎన్నో సినిమాలు చేస్తుంటామని, కొన్ని స్క్రిప్టులు నచ్చి మాత్రమే చేస్తుంటామని అలాంటప్పుడు పారితోషకం విషయాన్ని లెక్కలోకి పెద్దగా తీసుకోమని చెప్పారు ఈ సీనియర్ నటి.

ప్రస్తుతం ‘గుల్ మోహర్’ అనే సినిమాతో షర్మిలా మళ్లీ మనముందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో ఆమె ఇష్టాగోష్టి నిర్వహించారు. మనోజ్ బాజ్ పాయి, ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్ సిమ్రన్ తో కలిసి షర్మిల్ ఓటీటీలో రిలీజ్ కానున్న గుల్ మోహర్ సినిమాలో నటించారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా డిస్నీ ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News