Sharwanand: మన యంగ్ హీరోలు చేసే కొన్ని ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటే, మరికొన్ని మాత్రం ప్రేక్షకులు తమ అభిమాన హీరోలను నచ్చని పాత్రల్లో చూడలేక ఆదరించని నేపథ్యంలో ఫ్లాపులు చూడాల్సి వస్తోంది. అంతేకాదు, ఇలా ప్రయోగాలు చేసి దెబ్బై పోయిన స్టార్ హీరోలు.. హీరోయిన్లు చాలామందే ఉన్నారు. హీరోయిన్స్ విషయంలో ఇలా కథ కోసం తనను తాను ఫిజికల్‌గా మార్చుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కున్న స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఓ ఉదాహరణగా తీసుకోవచ్చు.
అలాగే, తమకున్న ఇమేజ్‌ని మించి చేసిన సినిమాలతో ఫ్లాప్స్ చూసిన యంగ్ హీరోలలో రవితేజ గురించి చెప్పుకోవచ్చు. నాగ శౌర్య, నితిన్‌లకి ఆడియన్స్‌లో లవర్ బాయ్, ఫ్యామిలీ హీరోలు అనే ఇమేజ్ ఉంది. కానీ, వీరు యాక్షన్ జోనర్ సినిమాలను చేసి ఇప్పుడు సక్సెస్‌ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇలా, ప్రయోగాలకి సిద్ధంగా ఉండే హీరోలలో నాని, శర్వానంద్ కూడా ఉన్నారు. హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా నాని ఊహించని ప్రయోగాలను చేస్తున్నాడు. వాటిలో కొన్ని కలొసొస్తే, ఇంకొన్ని నష్టాలను తెచ్చిపెడుతున్నాయి.
Also Read – Dimple Hayathi: నాకింకా పెళ్ళి కాలేదు.. షాకిచ్చిన డింపుల్ హయాతి
శర్వానంద్ కూడా ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్థానం లాంటి సినిమా ఓ ప్రయోగమే. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శతమానంభవతి సినిమా ఎలాంటి సక్సెస్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఇటీవల నారీ నారీ నడుమ మురారి అనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చి ఓ మోస్తారు హిట్ అందుకున్నాడు. ఇక, సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, బైకర్ అనే మరో సినిమాను యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్నాడు. ఈ సినిమాకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా సీనియర్ నటుడు డా.రాజశేఖర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.
అయితే, ఈ సినిమాతో ఓ ప్రయోగం చేస్తున్నాడని క్లారిటీ వచ్చింది. ఇందులో శర్వానంద్ తండ్రీకొడులుగా నటిస్తున్నాడట. ప్రేక్షకుల్లో శర్వాకి ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ప్రయోగం పెద్ద రిస్కే. మరి, కథా నేపథ్యం ఎలా ఉండబోతుందో అసలు తండ్రీకొడులుగా ఓ ఛాలెంజింగ్ రోల్ చేయడానికి శర్వా ఎలా ఒప్పుకున్నాడో అని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. గతంలో ఎన్‌టీర్ కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే ఆంధ్రావాలా అనే సినిమా చేశాడు. ఇందులో తండ్రీకొడులుగా తారక్‌ని ప్రేక్షకులు చూడలేక ఆ సినిమా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. మరి, శర్వాకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read – Rashmika Mandanna: ఆ ముగ్గురు కోసం ఐటం సాంగ్స్ కూడా ఒప్పుకుంటా!

