Sharwanand: శర్వానంద్ హిట్టు కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ మూడు సినిమాలు చేస్తున్నాడు. నెల రోజుల గ్యాప్‌లో శర్వానంద్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ‘బైకర్’ డిసెంబర్ 6న విడుదలకాబోతుంది. స్పోర్ట్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అభిలాష్ కంకర దర్శకత్వం వహించారు. అలాగే నారి నారి నడుమ మురారి మూవీ సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాకు ‘సామజవరగమన ఫేమ్’ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం బైకర్ మూవీ ప్రమోషన్స్‌లో శర్వానంద్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్‌గా స్పీచ్ ఇచ్చాడు శర్వానంద్. తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల గుర్తుచేసుకుంటూ శర్వానంద్ మాట్లాడినట్లు కనిపించింది. నా లైఫ్‌లో నేను చాలా సార్లు పడ్డాను. ఓడిపోయాను.. మోసపోయాను.. పడిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకున్నా. జీవితంలో నువ్వు ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే నమ్ముకోవాలి. మన కథ మనమే రాసుకోవాలి. బుక్కు నీది.. పెన్ను నీది.. స్టోరీ నీది…మీ ఇష్టం వచ్చినట్లు రాసుకొండి. ఫెయిలవుతామనే భయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ అన్నది సక్సెస్‌లో ఓ భాగమే. జీవితంలో కష్టాలు, నష్టాలు వస్తూనే ఉంటాయి. వాటికి భయకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. వాళ్లు ఏమనుకుంటారు.. వీళ్లు ఏమనుకుంటారన్నది పట్టించుకోవద్దు. పర్‌ఫెక్ట్ అనిపించుకోవడం కంటే జీవితంలో మంచివాడిగా ఉండటం చాలా ముఖ్యం అంటూ.. బైకర్ ప్రమోషన్స్‌లో శర్వానంద్ అన్నాడు. శర్వానంద్ స్పీచ్ వైరల్ అవుతోంది.
శర్వానంద్‌కు అతడి భార్య రక్షిత రెడ్డికి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విభేదాల కారణంగా భార్యకు శర్వానంద్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఈ మనస్పర్థలు విడాకుల వరకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కెరీర్ కూడా ఆశాజనకంగా సాగడం లేదు. 2017లో వచ్చిన శతమానం భవతి, మహానుభావుడు తర్వాత శర్వానంద్ చేసిన సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. కమర్షియల్ సక్సెస్ శర్వానంద్ కెరీర్‌కు కీలకంగా మారింది. ఇవన్నీ గుర్తుచేసుకొని బైకర్ ఈవెంట్‌లో శర్వానంద్ ఎమోషనల్ అయ్యాడని నెటిజన్లు చెబుతోన్నారు. గతంలో ఏ సినిమా ఈవెంట్‌లో కూడా ఇంతలా ఎమోషనల్ అవ్వలేదు. బైకర్, నారి నారి నడుమ మురారితో పాటు సంపత్ నందితో ఓ సినిమా కమిటయ్యాడు శర్వానంద్. పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి భోగి అనే టైటిల్ ఖరారు చేశారు.
Also Read- Deviyani Sharma: టైట్ ఔట్ ఫిట్ లో టెంప్ట్ చేస్తున్న సైతాన్ బ్యూటీ

