Friday, March 13, 2026
Homeచిత్ర ప్రభNari Nari Naduma Murari: ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ నారీ నారీ న‌డుమ...

Nari Nari Naduma Murari: ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ నారీ నారీ న‌డుమ మురారి

Nari Nari Naduma Murari: ఈ సంక్రాంతికి ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది నారీ నారీ న‌డుమ మురారి. శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీకి కామెడీని జోడించి తెర‌కెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మీన‌న్‌, సాక్షి వైద్య హీరోయిన్లుగా న‌టించారు. చిరంజీవి, ప్ర‌భాస్‌, ర‌వితేజ వంటి హీరోల సినిమాల‌కు పోటీగా సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.
నారీ నారీ న‌డుమ మురారి థియేట‌ర్ల‌లో రిలీజై ఇర‌వై రోజులు కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల‌ కాబోతుంది. థియేట‌ర్ల‌లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి రానుండ‌టం టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -

నారీ నారీ న‌డుమ మురారి మూవీని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంకర నిర్మించారు. ఇర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ న‌ల‌భై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాతో హీరోగా చాలా గ్యాప్ త‌ర్వాత శ‌ర్వానంద్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్నాడు. శ‌ర్వానంద్ కెరీర్‌కే కాకుండా ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర‌కు మంచి క‌మ్‌బ్యాక్ మూవీగా నారీ నారీ న‌డుమ మురారి నిలిచింది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న త‌ర్వాత ఈ సినిమాతో డైరెక్ట‌ర్ రామ్ అబ్బ‌రాజు సెకండ్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

Also Read – Eesha Rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశారు.. మొత్తానికి బయటపెట్టేసిన ఈషా రెబ్బా

నారీ నారీ న‌డుమ మురారి మూవీకి సీనియ‌ర్ న‌రేష్ కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఆయన పాత్ర నేప‌థ్యంలో వ‌చ్చిన పంచ్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇందులో సిరి హ‌నుమంతు, సుద‌ర్శ‌న్‌, సంప‌త్, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హీరో శ్రీవిష్ణు గెస్ట్ రోల్‌లో న‌టించాడు.

ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. బైక‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది. మార్చిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా సినిమాకు అభిలాస్ కంక‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సంప‌త్ నంది డైరెక్ష‌న్‌లో భోగి పేరుతో ఓ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు శ‌ర్వానంద్‌. ఇవే కాకుండా ఇటీవ‌లే శ్రీనువైట్ల డైరెక్ష‌న్‌లో ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు.

Also Read – Varanasi Release Date: ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఇదేనా?.. జక్కన్న ప్లాన్ అదుర్స్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News