Tuesday, February 17, 2026
Homeచిత్ర ప్రభThe India House: టాలీవుడ్‌లోకి ధురంధ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంట్రీ - మెగా ఛాన్స్ ఇచ్చిన...

The India House: టాలీవుడ్‌లోకి ధురంధ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంట్రీ – మెగా ఛాన్స్ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్‌

The India House: ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా న‌టించిన ధురంధ‌ర్ మూవీ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. రూ. 1400 కోట్ల‌తో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్ మూవీగా చ‌రిత్ర సృష్టించింది. ఆదిత్య ధ‌ర్ టేకింగ్.. ర‌ణ‌వీర్‌సింగ్‌, అక్ష‌య్ ఖ‌న్నా యాక్టింగ్‌తో పాటు శ‌శ్వాత్ స‌చ్‌దేవ్ పాట‌లు, బీజీఎమ్ కూడా ధురంధ‌ర్ విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి. ధురంధ‌ర్‌లోని పాట‌ల‌న్నీ పెద్ద హిట్ట‌య్యాయి.

- Advertisement -

బాలీవుడ్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించిన‌ ధురంధ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ‌శ్వాత్ స‌చ్‌దేవ్ తాజాగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రామ్‌చ‌ర‌ణ్ సినిమాకు సంగీతం అందించ‌బోతున్నాడు. నిఖిల్ హీరోగా దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా ది ఇండియా హౌజ్ పేరుతో ఓ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. రామ్ వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్‌తో క‌లిసి టాలీవుడ్ అగ్ర హీరో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. త‌న కొత్త బ్యాన‌ర్ వి మెగా పిక్చ‌ర్స్ పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఫ‌స్ట్ మూవీ ఇదే.

Also Read – Nirmala Sitharaman : భారత్-అమెరికా డీల్.. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు భారీ ఊరట

ది ఇండియా హౌజ్ సినిమాకు శ‌శ్వాత్ స‌చ్‌దేవ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స‌య్యాడు. ఇప్ప‌టికే ఈ మూవీ కోసం ఐదు సాంగ్స్‌ను శ‌శ్వాత్ కంపోజ్ చేశాడ‌ట‌. ఆ పాట‌ల అవుట్‌పుట్ విష‌యంలో మేక‌ర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్న‌ట్లు స‌మాచారం. బీజీఎమ్ కూడా ధురంధ‌ర్‌కు మించి ఉండ‌బోతుంద‌ని టాక్‌. టాలీవుడ్‌లో శ‌శ్వాంత్‌కు గ్రాండ్ డెబ్యూగా ది ఇండియా హౌజ్ ఉంటుంద‌ని అంటున్నారు. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.

ది ఇండియా హౌజ్‌తో పాటు నాని, సుజీత్ సినిమాకు కూడా శ‌శ్వాత్‌ స‌చ్‌దేవ్ మ్యూజిక్ అందించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నాని త‌న లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ధురంధ‌ర్ మ్యూజిక్ ట్రాక్‌ను ఉప‌యోగించ‌డంతో ఈ రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. త్వ‌ర‌లోనే అత‌డి పేరును మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. స్టైలిష్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానుంది. ది ఇండియా హౌజ్‌తో పాటు నాని, సుజీత్ మూవీ కూడా ఈ ఏడాది చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

Also Read – Trump : భారత్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్.. ఆయన లెక్క వేరే ఉంది బాసూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News