Wednesday, February 5, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam February 5th Episode: శౌర్య కోసం ఎమోషనల్ అయిన కార్తిక్.. ఆపరేషన్ సక్సెస్..

Karthika Deepam February 5th Episode: శౌర్య కోసం ఎమోషనల్ అయిన కార్తిక్.. ఆపరేషన్ సక్సెస్..

ఈరోజు ఎపిసోడ్‌లో మా నాన్న డబ్బు ఇస్తే వంద మందికి తెలిస్తేనే కాని ఇవ్వడు అంటాది ఇలా సైలెంట్‌గా ఇస్తాడా అంటాడు కార్తిక్. నువ్వు ఇచ్చావా అని కాశీని అడిగితే లేదు అంటాడు. ఎవరు కట్టారో అని కార్తిక్, కాశీ ఆలోచిస్తుంటే దీప మాత్రం మీ పిన్ని చేశారని తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో అనుకుంటుంది. ఈలోపు ఎవరో ఒక ఆవిడ ఏడుస్తూ వెళ్తుంటే ఏమైంది అని అడిగితే ఆపరేషన్ చేసినా నా బిడ్డ బతకలేదు అని ఏడుస్తుంటే ఆ మాటలకు దీప ఇంకా భయపడిపోతుంది. శౌర్యకు ఏమి కాదు నువ్వు భయపడకు అని కార్తిక్, కాశీ ధైర్యం చెప్తారు. శౌర్యకి ఆపరేషన్ బాగా జరగాలని దేవుడికి కోరుకుంటారు. ఈలోగా డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని చెప్తాడు. అప్పుడు దీప, కార్తిక్ ఊపిరి పీల్చుకుంటారు.

- Advertisement -

మరోవైపు శ్రీధర్ కావేరి కోసం ఇంట్లో కాలు కాలిన పిల్లిలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా కావేరి వస్తుంది. శ్రీధర్ ఎక్కడికి పోయావు చెప్పి వెళ్లాలి కదా అని అరుస్తాడు. ఎక్కడికి వెళ్లావు అంటే కావేరి అసలు నిజం చెప్పకుండా పూజ సామాన్లు కొనుక్కోవడానికి వెళ్లానని సాకులు చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతుంది. కావేరి ప్రవర్తన మీద శ్రీధర్ మాత్రం అనుమానంతో ఉంటాడు. అక్కడ హాస్పిటల్‌లో కార్తీక్ టిఫిన్ ముందు కూర్చుని ఇప్పటివరకూ ఎంత బాధ పడ్డాడో దీపకు చెప్పకుంటాడు. కార్తిక్ మాటలకు దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మా నాన్న విషయంలో మా అమ్మ బాధపడినప్పుడు కుడా నేను బాధపడలేదు. ఇంత చిన్న వయసుకే దానికి గుండె జబ్బు వచ్చింది, ఒకప్పుడు నాకు నాన్నగా ఉండగలవా నేను ఏమి అడిగినా చేస్తానా అని శౌర్య అడిగినప్పుడు దానికోసం ఏమైనా చేయాలనిపించింది. ఇలా శౌర్య కోసం చెప్తూ కార్తిక్ బాధపడుతాడు. శౌర్య ఇంక నన్ను నాన్న అని పిలవదేమో అనుకున్నాను చాలా భయపడిపోయాను అని ఏడుస్తాడు. కార్తీక్ ని తన ఒడిలో పడుకోబెట్టుకుని దీప కార్తిక్‌ని ఓదారుస్తుంది. శౌర్య మీ కూతురు ఇప్పుడు చెప్తున్నాను మీ తర్వాతే నేను అంటుంది. ఇంతటితో ఈరోజుఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News