Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభShirish: నాగవంశీ అలా, మైత్రీ ఇలా..!

Shirish: నాగవంశీ అలా, మైత్రీ ఇలా..!

Dil Raju Brother: తెలుగు ఇండస్ట్రీలో ముందు డిస్ట్రిబ్యూటర్‌గా ఆ తర్వాత నిర్మాతగా మారి ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు దిల్ రాజు. ఆయన సోదరుడు శిరీష్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్‌గా సుపరిచితులే. దిల్ రాజు, శిరీష్‌తో కలిసి పలు బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు.. అలాగే డిస్ట్రిబ్యూషన్ చేశారు. అయితే తాజాగా శిరీష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, వాళ్ళు తీసుకున్న సినిమాల ఫ్లాప్ ప్రభావం ఎలా ఉంది అనేది లెక్కలతో సహా బయట పెట్టారు.

- Advertisement -

సితార సంస్థ అధినేత నిర్మాత నాగవంశీతో దిల్ రాజు సోదరులకి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పడం, మరో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మీద ఆరోపణలు చేయడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయింది. మరీ ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద శిరీష్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో పెద్ద దుమారమే రేపాయి. సితార బ్యానర్ నుంచి తీసుకున్న ఏ సినిమా మాకు నష్టం తేలేదని ఆయన అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచించే నిర్మాతలు మా తర్వాత ఎవరైనా ఉన్నారంటే.. అది నాగవంశీ ఒక్కరే అని శిరీష్ చెప్పుకొచ్చారు. నాగవంశీ తమ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే, ఆ నష్టాన్ని మరో రూపంలో రికవర్ చేస్తారని తెలిపారు. వాళ్ల సినిమా వల్ల లాస్ వస్తే తిరిగి డబ్బు చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. కానీ మైత్రి మూవీస్ లో మాత్రం అలా సపోర్ట్ చేయరని వాపోయారు. మైత్రిలో ప్రతీ సినిమాకి రేట్లు బాగా ఎక్కువ చెబుతుంటారు.

వాళ్ళు చెప్పిన రేట్లకే సినిమాను కొనాలని, ఒకవేళ సినిమా ఫ్లాపై డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే మైత్రి వాళ్లు అసలు పట్టించుకోరని శిరీష్ మాట్లాడారు. మైత్రి నుంచి తీసుకున్న సవ్యసాచి సినిమాతో 3 కోట్లకు పైగానే నష్టపోయామని అన్నారు శిరీష్. అంతేకాదు, నాని నటించిన గ్యాంగ్ లీడర్.. అంటే సుందరానికి సినిమాల వల్ల దాదాపు రెండు కోట్ల వరకూ నష్టపోయామని ఆయన తెలిపారు. ఆ నష్టాన్ని తిరిగి పూడ్చుతామని చెప్పారు మైత్రీ వారు. కానీ, ఆ తర్వాత ఆ విషయాన్నే పక్కన పెట్టారని మైత్రి మూవీ మేకర్స్ గురించి శిరీష్ ఓపెన్ అయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవగా మళ్ళీ దిల్ రాజు అండ్ శిరీష్ వివరణ ఇస్తూ వీడియోను, లేఖను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News