Shraddha Das: సినీ నటి శ్రద్ధాదాస్ తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఏజ్ పెరిగినా ఏమాత్రం చెక్కుచెదరలేదు ఈ అమ్మడి అందం. తాజాగా శ్రద్ధా షేర్ చేసిన లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి.

టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ 1987 మార్చి 4న ముంబైలో పుట్టింది. మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది.

‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. ఆ తర్వాత ఏక్ మినీ కథ, డిక్టేటర్, మెుగుడు, నాగవల్లి, డార్లింగ్, ఆర్య2 వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

‘లాహోర్’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది.

శ్రద్ధా దాస్ తన కెరీర్ లో ఆరు సినీ ఇండస్ట్రీల్లో పనిచేయడం విశేషం.

గతంలో ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 15’లో జడ్జిగా వ్యవహారించింది శ్రద్దా.

అవకాశాలు తగ్గడంతో.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమనులతో పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంది.