Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా థియేటర్లకు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్ ని మూవీ టీం రెండుసార్లు నిరాశ పరిచింది. మార్చి, ఏప్రిల్ అంటూ రెండు డేట్స్ ప్రకటించిన మూవీని వాయిదా వేశారు మేకర్స్. ఇక జూన్ లో సినిమా రిలీజ్ చేస్తామని ఇటీవల మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ పెద్ది షూటింగ్ పూర్తి కానుంది.
అయితే ఈ సినిమాలోని ఐటెం సాంగ్ పై కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పెద్దిలో ఐటెం సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో పెద్ది ఐటెం సాంగ్ పై ఆడియన్స్, ఫ్యాన్స్ లో క్యూరియాసిటి పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ పాటలో నటించే హీరోయిన్ ఎవరా అని ఆరా తీస్తుంగా.. రోజుకో హీరోయిన్ పేరు తెరపై వస్తుంది.
ఇటీవలే సంయుక్త మీనన్ ఈ ఐటమ్ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. గతంలో మృణాల్ ఠాకూర్, మానస అని పలువురు కూడా తెరపైకొచ్చాయి. కానీ అంతలోనే ఊహించని మరో స్టార్ హీరోయిన్ పేరు బయటకొచ్చింది. పెద్ది ఐటమ్ సాంగ్‌లో కోలీవుడ్ భామ శృతి హాసన్ చేయనుందని లేటేస్ట్ టాక్ నడుస్తోంది. దాదాపు శృతిని మేకర్స్ ఖరారు చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఒకవేళ ఇదే నిజమైతే పెద్ది సరసన శృతి హాసన్ చిందులేయనుంది. ఈ ఐటమ్ సాంగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సాంగ్ కచ్చితంగా స్పెషల్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు.
Also Read: Monalisa: తల్లికాబోతున్న వైరల్ గర్ల్ మోనాలిసా.. పోలీసులకు షాకిచ్చిన ఆమె భర్త!

