Saturday, July 12, 2025
Homeచిత్ర ప్రభSiddharth: ‘3 BHK’తో సిద్ధార్థ్ హిట్ కొట్టాడా? ఆడియెన్స్ ఏమంటున్నారంటే!

Siddharth: ‘3 BHK’తో సిద్ధార్థ్ హిట్ కొట్టాడా? ఆడియెన్స్ ఏమంటున్నారంటే!

3 BHK Twitter Review: సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘3 BHK’. శ్రీగ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సిద్ధార్థ్ హీరోగా న‌టించిన 40 మూవీ ఇది. దేవ‌యాని, యోగిబాబు, మీతా ర‌ఘునాథ్‌, చైత్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిడిల్ క్లాస్ కుటుంబానికి సొంతిల్లు ఉండాల‌నేది క‌ల‌. దాన్ని నేర‌వేర్చుకునే క్ర‌మంలో వాళ్లెంతో క‌ష్ట‌ప‌డుతుంటారు. అలాంటి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించింది.. నెటిజ‌న్స్ సినిమా గురించి ఏమ‌నుకుంటున్నార‌నే వివ‌రాల్లోకెళ్తే..

- Advertisement -

‘3 BHK’ ఓ ప్రేమ‌, నిజం, జీవితం క‌నిపిస్తుంది. అన్నీ భావోద్వేగాలున్న కుటుంబ క‌థాచిత్ర‌మిది. ప్ర‌తీ ఒక యాక్ట‌ర్ త‌మ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అని ఓ నెటిజ‌న్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు.

‘3 BHK’ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ. ఎమోష‌న‌ల్‌గా హృద‌యాల‌ను క‌రిగించింది. న‌వ్వించింది.. ఏడిపించింది. కుటుంబాల‌కు ఈ సినిమా అంకితం అంటూ మ‌రొక‌రు సినిమా త‌న కోణంలో ఎలా ఉంద‌నే విష‌యాన్ని రివీల్ చేశాడు.

‘3 BHK’ మూవీ చ‌క్క‌గా ఉంది. హృద‌యాన్ని తాకుతుంది. సినిమా స్వ‌చ్ఛంగా ఉంది. సిద్ధార్థ్‌, మీతా, శ‌ర‌త్ కుమార్‌, చైత్ర‌..ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించారంటూ ఓ నెటిజ‌న్ సినిమాపై పాజిటివ్‌గా స్పందించారు.

‘3 BHK’ ఎమోష‌న‌ల్, రియలిస్టిక్ మూవీ. సిద్ధార్థ్‌, మీతా రంగ‌నాథ్ చాలా బోల్డ్‌గా న‌టించారు. సాంగ్స్ చ‌క్క‌గా ఉన్నాయి. ఎమోష‌న‌ల్ సీన్స్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతాయి. ఇదొక సినిమా కాదు. చాలా మంది వారి జీవితాల‌ను ఇందులో చూసుకుంటారంటూ ఓ నెటిజ‌న్ త‌న ఓపినియ‌న్‌ను షేర్ చేశాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News