Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభNikhil - Swayambhu: ‘స్వయంభు’ మళ్లీ పోస్ట్ పోన్?.. అసలు నిఖిల్ సినిమా పరిస్థితేంటి!

Nikhil – Swayambhu: ‘స్వయంభు’ మళ్లీ పోస్ట్ పోన్?.. అసలు నిఖిల్ సినిమా పరిస్థితేంటి!

Nikhil – Swayambhu: ఒకప్పుడు టైర్‌3 హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కి ‘కార్తికేయ – 2’ మంచి ఇమేజ్‌ను తీసుకొచ్చింది. దీంతో త‌ను ఒక‌సారిగా మిడ్‌రేంజ్ హీరోగా మారిపోయాడు. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా తెచ్చిన గుర్తింపు నిఖిల్ కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్లింది. అయితే ఆ సక్సెస్‌కు తగ్గ స్థాయిలో తర్వాతి సినిమాలు లేకపోవడం అతడికి ఇప్పుడు మైనస్‌గా మారింది. ‘18 పేజెస్’ మూవీ చూడ‌టానికి ఓకే అనిపించినప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం పెద్ద‌గా ఎఫెక్ట్ చూపించ‌లేదు. ఆ తర్వాత వచ్చిన ‘స్పై’, ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రాలు ఘోర పరాజయాలను చవిచూశాయి. దీనికి తోడు సినిమాల మధ్య పెద్ద గ్యాప్ రావడంతో నిఖిల్ గురించి ఫ్యాన్స్‌, అభిమానులు ఆలోచించ‌టం త‌గ్గించేశారు. మ‌రో వైపు ఇండస్ట్రీలోనూ బ‌జ్ తగ్గిపోయింది.

- Advertisement -

అయితే నిఖిల్ ఆశలన్నీ ఇప్పుడు తన కొత్త సినిమా ‘స్వయంభు’పైనే ఉన్నాయి. రెండు నెలల క్రితం విడుదలైన మేకింగ్ వీడియో సినిమా మీద మంచి అంచనాలను పెంచింది. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైనా, ఆ గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్ మాత్రం సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. అదే వీడియోలో ఫిబ్రవరి 13ను విడుదల తేదీగా ప్రకటించడం కూడా ఆసక్తిని పెంచింది.

Also Read – Krithi Shetty: కృతీశెట్టి ఇచ్చిన ఝలక్.. శ్రీలీల పరిస్థితేంటి?

కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ‘స్వయంభు’ అనుకున్న తేదీకి థియేటర్లకు రావడం కష్టమేనంటున్నాయి మూవీ స‌ర్కిల్స్‌. విడుదలకు ఇంకా 20 రోజులే మిగిలి ఉన్నా.. చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక అప్‌డేట్ రావడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయాల్సిన సినిమాకు ఇప్పటి వరకే ప్రమోషన్లు ఊపందుకోవాలి. కానీ అలాంటి హడావుడి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సినిమా వాయిదా పడినట్టేనన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. సమాచారం ప్రకారం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో సినిమాను విడుదల చేయాలని టీమ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చిన వెంటనే వాయిదా విషయంతో పాటు తాజా విడుదల తేదీని ఒకేసారి అధికారికంగా ప్రకటించనున్నారని టాక్.

Also Read – Ratha Sapthmi: వీటిని కానీ దానం చేశారంటే..మీ దరిద్రం పరార్‌!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News