Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభSimran: హీరోయిన్ సిమ్రన్ గుర్తుందా..సిమ్రన్ కొత్త సినిమా రిలీజ్ కు రెడీ

Simran: హీరోయిన్ సిమ్రన్ గుర్తుందా..సిమ్రన్ కొత్త సినిమా రిలీజ్ కు రెడీ

నంబర్ వన్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సిమ్రన్ గుర్తుందా. చాలాకాలం తరువాత ఆమె మళ్లీ తళుక్కుమంటున్నారు. ఈసారి మంచి ఫ్యామిలీ స్టోరీతో ఆమె థర్డ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. ఆమధ్య రజనీకాంత్ తో కలిసి పెటాలో యాక్ట్ చేసినా మళ్లీ ఛాన్సులు లేక ఆమె ఖాళీగా ఉన్నారు. తాజాగా మనోజ్ బాజ్ పేయితో ఆమె జతకట్టి ఓటీటీ సినిమాతో వస్తున్నారు.

- Advertisement -

ఫ్యామిలీ మ్యాన్ రెండు సిరీస్ లు హిట్ కావటంతో మళ్లీ కెరీర్ లో బిజీ యాక్టర్ గా మారారు మనోజ్. ఇప్పుడు ఓటీటీ సిరీస్ లతో ఆయన తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ 3 ఇప్పట్లో రాదని చెప్పకనే చెప్పిన మనోజ్ బాజ్ పాయి.. తన కొత్త ఫ్యామిలీ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు. గుల్ మోహర్ పేరుతో వస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో షర్మిలా ఠాగూర్, అలనాటి అందాల తార సిమ్రన్ వంటి ప్రముఖులున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ఇది వచ్చేనెల 3 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది. 12 ఏళ్ల తరువాత షర్మిలా ఇలా సినిమాలో కనిపిస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News