Tuesday, December 9, 2025
Homeచిత్ర ప్రభNag Ashwin: యంగ్ ప్రొడ్యూసర్‌తో లెజెండరీ డైరెక్టర్ సినిమా!

Nag Ashwin: యంగ్ ప్రొడ్యూసర్‌తో లెజెండరీ డైరెక్టర్ సినిమా!

Nag Ashwin: సినిమా లవర్స్‌కి ఇది నిజంగా పండగే! ‘మహానటి’తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన యంగ్ డైరెక్టర్, ఇప్పుడు నిర్మాతగా మారిన మన నాగ్ అశ్విన్, ఈసారి ఏకంగా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో జతకట్టబోతున్నాడట. సింగీతం ఎలాంటి సినిమాలు తీస్తారో మనకు తెలిసిందే! అలాంటి దర్శకుడికి నాగ్ అశ్విన్ లాంటి టేస్ట్ ఉన్న నిర్మాత తోడైతే, ఆ సినిమా మామూలుగా ఉండదు. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ALSO READ: Varanasi: మహేష్ బాబు ‘వారణాసి’ కథ మొత్తం ఆ దేవత చుట్టే!

సింగీతం శ్రీనివాసరావు అంటేనే మనకు ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’ లాంటి అద్భుతమైన కథలు గుర్తుకొస్తాయి. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా రొటీన్ కి భిన్నంగానే ఉంటాయి. ఇటు నాగ్ అశ్విన్ కూడా ఎప్పుడూ కొత్త ఐడియాలతోనే సినిమాలు తీస్తాడు. అందుకే, ఈ ఇద్దరి ఐడియాలజీ కలిస్తే.. వచ్చే సినిమా ఇంకెంత కొత్తగా ఉంటుందో అంటూ ప్రేక్షకులు ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు! ఇది కచ్చితంగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ లాంటి మన ఊహకు కూడా అందని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని అంతా ఫిక్స్ అయిపోతున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు అని తెలుస్తోంది.

ALSO READ: Thalaivar173: రజినీ-కమల్ ప్రాజెక్ట్‌కు ధనుష్ దర్శకత్వం!

ఇక ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే ఆలస్యం!

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇది దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని కూడా అంటున్నారు. నాగ్ అశ్విన్ తన ‘కల్కి 2’ సినిమా పనులు పూర్తయిన వెంటనే, సింగీతం సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇద్దరు అద్భుతమైన దర్శకులు కలిసి పనిచేస్తున్నారంటే.. ఆ సినిమా కోసం ఎంత వెయిట్ చేసినా తక్కువే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News