Singer mangli: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫోక్ సింగర్ గా ఎంత పాపులారిటీని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఈ పాపులారిటీతో సినిమాల్లోనూ సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడుతోంది. ఎంత సినిమాలలో పాటలు పాడుతున్నా, తన సొంత భాషకి మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తోంది. తన భాషా, ప్రాంతం గురించి వివరిస్తూ ఎప్పటికప్పుడు కొత్త జానపద గీతాలను అందిస్తోంది మంగ్లీ.
ఈ క్రమంలోనే ఇటీవల మంగ్లీ ‘బాయిలోనే బల్లి’ అనే సాంగ్ ను రూపొందించింది. ఈ సాంగ్ విపరీతంగా పాపులర్ అయింది. ఎంతోమంది ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మేడిపల్లి స్టార్ మాత్రం మంగ్లీ పాటలోని పదాలను తప్పు పడుతూ తనని అసభ్యపదాలతో కామెంట్స్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయింది. దీంతో అది కాస్తా మంగ్లీ దృష్టికి వెళ్ళింది.
Also Read – Vijay Devarakonda: విజయ్ దేవరకొండ-రష్మిక ఇలా కూడా ఉంటారా..?
దాంతో మంగ్లీ మేడిపల్లి స్టార్ పై రాతపూర్వకంగా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన భాష, వర్గం నుంచి తీసుకొని రాసిన పాటను కించపరుస్తూ దూషించిన విషయాన్ని స్పష్టం చేస్తూ మంగ్లీ కంప్లైంట్ చేసింది. ఆమె ఇలా కంప్లైంట్ చేసిన 24 గంటల్లోనే ఇన్స్టా యూజర్ అయిన మేడిపల్లి స్టార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అది అతనికి కొత్తేమీ కాదట.
ఇప్పటికే, మేడిపల్లి స్టార్ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ ఇలా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులను పెట్టి ఇబ్బందులకి గురిచేస్తున్నాడట. ఇంతకముందు కూడా ఇలా చేసిన సందర్భాలున్నాయని పోలీసులు వెల్లడించారు. అతని వ్యవహారం సమాజంలో యువతను తప్పుదోవ పట్టించేదిగా ఉందని దీనికి సంబందించి కఠిన చర్యలు అతనిపై తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read – Chikiri Song: చికిరి సాంగ్ కోసం చరణ్ చేసిన సాహసం చూస్తే షాకవ్వాల్సిందే..

