Sitara: గ్లోబ్‌ట్రాటర్ మేనియాతో టాలీవుడ్ మొత్తం షేక్ అయ్యింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన వారణాసి ఈవెంట్ పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ ఈవెంట్‌కు మహేష్ ఫ్యాన్స్‌తో పాటు దేశం నలుమూలల నుంచి సినీ లవర్స్ అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్‌లోనే సినిమాకు వారణాసి అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. గ్లింప్స్ రిలీజ్ చేశారు. మైథలాజికల్, ఫాంటసీ, యాక్షన్ అంశాలతో ఈ గ్లింప్స్ అభిమానుల్లో హైప్‌ను ఎక్కించేసింది.
వారణాసి ఈవెంట్‌లోకి మహేష్‌బాబు ఎంట్రీ ఇచ్చే క్రమంలో జై బాబు అంటూ అభిమానుల నినాదాలతో ఈవెంట్ జరిగే ప్లేస్ దద్దరిల్లిపోయింది. చాలా రోజుల తర్వాత ఈ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌తో అభిమానుల ముందుకు వచ్చారు మహేష్. సూపర్ స్టార్‌ను ప్రత్యక్షంగా చూడటంతో అభిమానుల ఆనందానికి అంతు లేకపోయింది. నాన్ స్టాప్‌గా జై బాబు అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. అభిమానులు ఉత్సాహం, వారి ప్రేమకు మహేష్‌బాబు కూతురు సితార ఘట్టమనేని కూడా ఫిదా అయ్యింది.
Also Read- Sharwanand: నేను మోసపోయాను.. ఓడిపోయాను – హీరో శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్
అభిమానులతో కలిసి సితార కూడా జై బాబు అంటూ నినాదాలు చేసింది. చైర్‌లో కూర్చొనే చేతులు పైకెత్తి ఆనందంతో జై బాబు అంటూ గట్టిగా అరిచింది. కూతురు స్లోగన్స్‌తో మహేష్, నమత్రా చిరునవ్వులు చిందించారు. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెస్ట్ తండ్రీకూతుళ్లు అంటూ వీడియోను ఉద్దేశించి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కూతురిగా సితార, తండ్రిగా మహేష్ గర్వపడే క్షణాలు ఇవని పేర్కొంటున్నారు. మహేష్ స్పీచ్ ఇస్తున్నప్పుడు సితార ఘట్టమనేనితో పాటు నమ్రతా శిరోద్కర్ చాలా ఆనందంగా కనిపించారు. స్పీచ్ ఇచ్చి స్టేజ్ దిగే టైమ్‌లో సితార ఆనందం పట్టలేక మహేష్‌బాబు భుజాలపై చేతులు వేసి ఆనందంతో గంతులు వేసింది.
వారణాసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో మహేష్‌బాబు పేర్కొన్నారు. ‘జీవితంలో ఒక సారి మాత్రమే వచ్చే ప్రాజెక్ట్ ఇది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత పడతా.. రాజమౌళి గర్వపడేలా కష్టపడతా. ఈ సినిమా చూసి దేశం మొత్తం గర్విస్తుంది’ అని గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్‌బాబు అన్నారు.
వారణాసి మూవీలో మహేష్‌బాబు శ్రీరాముడి క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు రాజమౌళి పేర్కొన్నాడు. శ్రీరాముడి పాత్ర తాలూకు ఎపిసోడ్స్‌ను అరవై రోజులు షూట్ చేశామని రాజమౌళి అన్నారు. రాముడి పాత్రలో మహేష్ అద్భుతంగా నటించారని చెప్పాడు. వారణాసి మూవీకి 2027 సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ట్రైమ్ ట్రావెట్‌కు మైథాలజీ ఎలిమెంట్స్ జోడించి ఈ మూవీని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చేశారు రాజమౌళి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించాడు.

