Homeచిత్ర ప్రభSKN: అప్పుడు అవకాశాలు పొంది...ఇప్పుడు కించపరచడం తగదు

SKN: అప్పుడు అవకాశాలు పొంది…ఇప్పుడు కించపరచడం తగదు

– నటీమణులకు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ హితవు

- Advertisement -

ఇటీవల కొందరు నాయికలు తెలుగు చిత్ర పరిశ్రమను, దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీని విమర్శిస్తూ మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడే అవకాశాలు పొంది ఇదే పరిశ్రమలను కించపరిచేలా మాట్లాడుతున్న నాయికలను ఉద్దేశించి తనదైన శైలిలో హితవు పలుకుతూ ఓ పోస్ట్ పెట్టారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్. ఆ మేరకు ఆయన స్పందిస్తూ, “టాలీవుడ్ లో, సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో అవకాశాలు పొంది, గుర్తింపు తెచ్చుకున్న కొందరు నాయికలు కొన్నేళ్ల తర్వాత ఇదే పరిశ్రమను విమర్శించడం తగదు. సదరు నాయికలు ఇక్కడి కథలు, సంప్రదాయాలను తప్పుగా పేర్కొంటున్నారు.

ప్రతి యాక్టర్ కు తమ అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సద్విమర్శలు చేయకుండా మిమ్మల్ని ఆహ్వానించిన పరిశ్రమనే చిన్న చూపు చూసేలా మాట్లాడటం సరికాదు. తెలుగు సినిమా, దక్షిణాది సినిమా పరిశ్రమలు కథల్లో తమదైన సంప్రదాయాలను, సంస్కృతులను ప్రదర్శిస్తాయి. బయటి వాళ్లకు అవి అసాధారణంగా అనిపించవచ్చు. మాకు మాత్రం ఆ సంప్రదాయాలు, సంస్కృతులు పరిచితమే. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. అవకాశాలు వచ్చినప్పుడు ఎంతో అపురూపంగా భావించిన మీరు ఇప్పుడు వాటిని కించపరచడం అంగీకారం కాదు. మాదే గొప్ప సంస్కృతి అనేలా ప్రవర్తించడాన్ని ఎవరూ ఒప్పుకోరు. మిమ్మల్ని గౌరవించిన పరిశ్రమను గౌరవించండి” అంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News