Saturday, July 12, 2025
Homeచిత్ర ప్రభOh Bhama Ayyo Rama: సుహాస్‌కి సోలో డేట్..

Oh Bhama Ayyo Rama: సుహాస్‌కి సోలో డేట్..

Oh Bhama Ayyo Rama Movie: టాలీవుడ్‌లో మజిలీ వంటి చిత్రాలతో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ఆ తర్వాత హీరోగా మారి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో సుహాస్ కి అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం సుహాస్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో ఉప్పుకప్పురంబు.. అలాగే, హీరోగా ఓ భామ అయ్యో రామ సినిమాలు రెడీగా ఉన్నాయి.

- Advertisement -

వీటిలో ఉప్పు కప్పురంబు సినిమా నేరుగా ఓటీటీలో జూలై 4న రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవబోతుంది. ఇక ఓ భామ అయ్యో రామ సినిమా మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. రొమాన్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ సినిమాను హరీశ్ నల్ల తెరకెక్కించారు. సుహాస్‌కి జంటగా మాళవిక మనోజ్ నటించింది. అనిత, ఆలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమలను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని అంచనాలు పెంచేసింది.

అంతేకాదు, వరుసగా ఇంటర్వూలు ఇస్తూ సినిమాను ప్రేక్షకులకి చేరువ చేసే పనిలో ఉన్నారు. ఇంతకముందు సుహాస్ నటించిన గొర్రె పురాణం, శ్రీరంగనీతులు, జనక అయితే గనక సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. స్మాల్ స్క్రీన్ మీద జనక అయితే గనక చిత్రానికి మంచి రేటింగ్ కూడా వచ్చింది. వీటి తర్వాత అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్, రైటర్ పద్మభూషణ్ చిత్రాలు సుహాస్ కి మంచి పేరు తెచ్చాయి. ఇక త్వరలో ఓ భామ అయ్యో రామ చిత్రం రాబోతుంది.

అయితే, నిన్నామొన్నటి వరకు సుహాస్‌కి పోటీగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన ఘాటి చిత్రం ఉంది. కానీ, తాజా సమాచారం మేరకు ఘాటి అనుకున్న డేట్‌కి రిలీజ్ కావడం లేదట. ఇప్పటికే, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఘాటి జూలై 11న రిలీజ్ చేయాలని డేట్ ని కూడా ప్రకటించారు. అదేరోజు సుహాస్ సినిమా కూడా ఉంది. కానీ, ఇప్పుడు అనుష్క మూవీ పోస్ట్ పోన్ అవడంతో సుహాస్ కి సోలో డేట్ దొరికిందంటున్నారు. చూడాలి మరి ఓ భామ అయ్యో రామ మూవీతో సుహాస్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News