Homeచిత్ర ప్రభSonali Bendre: సోనాలి బింద్రేపై భూ కబ్జా కేసు.. నటి రియాక్షన్‌

Sonali Bendre: సోనాలి బింద్రేపై భూ కబ్జా కేసు.. నటి రియాక్షన్‌

Sonali Bendre: నటి సోనాలి బింద్రే వివాదంలో చిక్కుకుంది. భూమి కబ్జా వ్యవహరంలో ఆమెపై కేసు నమోదైంది. సోనాలి బింద్రే, ఆమె భర్త గోల్డీ బేహల్ అక్రమంగా తన భూమిని కొనుగోలు చేశారంటూ ఓ రైతు కోర్టు ఆశ్రయించారు. తనకు న్యాయాం చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇంతకి అసలేం జరిగిందంటే.. పూణేలోని మావల్ ప్రాంతానికి చెందిన రైతు చంద్రకాంత్ షిండేకు సుమారు 30 గుంటల భూమి వారసత్వంగా వచ్చింది.

- Advertisement -

భూ కబ్జా ఆరోపణలు
ఆ భూమిని సినీనటి సోనాలి బింద్రే , ఆమె భర్త గోల్డీ బేహల్ అక్రమంగా కొనుగోలు చేశారు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోనాలి బింద్రే భర్త గోల్డీ బేహల్ తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండ అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు. తన భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ వడగావ్ మావల్ సివిల్ కోర్టులో ఆ రైతు పిటిషన్ దాఖలు చేశారు. సుమారుగా 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భూమిలో అక్రమంగా నిర్మాణం కూడా చేస్తున్నారని ఆరోపించారు. పైగా దీనిపై ప్రశ్నించినందుకు తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని రైతు తెలిపారు.

Also Read: Ramayana Glimpse: విజువల్‌ వండర్‌గా ‘రామాయణ’ టీజర్‌.. రాముడి లుక్‌ అవుట్‌!

నటి స్పందన
అతడి ఫిర్యాదు మేరకు సోనాబి బింద్రే, ఆమె భర్తకు కోర్టు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సినీ ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సోనాలి బింద్రే తరపు న్యాయవాది స్పందించారు. భూమి కొనుగోలు పత్రాల్లో ఆమె పేరు ఎక్కడ లేదని, ఇవన్ని ఆరోపణలు మాత్రమే అని ఖండించారు. కావాలని డబ్బు కోసం ఇదంత చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఈ భూ కబ్జా విషయంలో సదరు రైతు తహసీల్దారు, సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గర పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయితే అవన్నీ నిరాధారమైన ఆరోపణలంటూ వాటిని కొట్టివేశారన్నారు. అయితే తాజాగా కేసును విచారించిన న్యాయస్థానం సోనాలి బింద్రే ఆమె భర్త తో పాటు మరికొంతమందిని ప్రతివాదులుగా చేర్చిందని తెలిపారు. తదుపరి విచారణను ఏప్రిల్ 20వ తేదీకి వాయిదా వేసిందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News