Homeచిత్ర ప్రభSonia-Siddhu: ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న క్రేజీ కపుల్‌ సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్‌

Sonia-Siddhu: ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న క్రేజీ కపుల్‌ సిద్ధూ-సోనియా.. ముహుర్తం ఫిక్స్‌

Sonia-Siddhu Marriage: సిద్ధూ-సోనియా ఈ జంటకు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌, బుల్లితెర ఆడియన్స్‌కి వీరిద్దరు బాగా సుపరిచితం. యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ఈ జంటకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఇక బుల్లితెరపై వీరిద్దరి చేసే సందడి అంత ఇంత కాదు. సోనియా సింగ్‌ తనదైన అమాయకత్వం, ఫన్నీ డైలాగ్స్‌తో ఎంతోమందిని ఆకట్టుకుంది.

- Advertisement -

ఆ షోతో పాపులర్
జీ-తెలుగు షోతో ఎంతో ఆదరణ పొందిన ఈ జంట ఎన్నో రియాలిటీ షోలో పాల్గొని తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సోనియా సింగ్‌ వెల్లడించింది. కాగా నిజానికి వీరిద్దరు జంటగా ఆడియన్స్‌కి పరిచయం. వీరి మధ్య జరిగే సరదా సంభాషణ, మాటలు, చిలిపి చేష్టలకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. బుల్లితెరపై క్యూట్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన వీరు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ లో పెళ్లి
లివిన్‌లో ఉంటూ పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు. అయితే తాజాగా వీరి పెళ్లిపై సోనియా ప్రశ్న ఎదురైంది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న టాక్‌ షాలో పాల్గొన్న సోనియాను.. యాంకర్‌ తమ పెళ్లి గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె నుంచి ఊహించని సమాధానం ఇచ్చింది. “ఏమో.. పెళ్లయిపోయిందేమో.. నేను చెప్పట్లేదేమో” అంటూ నవ్వింది. దీంతో ఇది సరదాగా చెప్పిందని అర్థమైంది. ఆ తర్వాత వెంటనే అసలు విషయాన్ని వెల్లడిస్తూ తమ వివాహ తేదీని కూడా ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 1:45 గంటలకు వీరి పెళ్లికి ముహుర్తం ఖరారైందంటూ వెల్లడించింది. దీంతో వీరి ఫ్యాన్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

Also Read: Peddi OTT: పెద్ది ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

ఎట్టకేలకు వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న సోనియా సింగ్, అనంతరం షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. విరూపాక్ష చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె అందులో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కామెడీ పాత్రలో మెప్పించింది. ఇటీవల విడుదలైన నాగబంధం చిత్రంలోనూ ఆమె కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News