Wednesday, January 15, 2025
Homeచిత్ర ప్రభRajaSaab: సంక్రాంతి కానుకగా ‘రాజాసాబ్’ పోస్ట‌ర్ రిలీజ్‌

RajaSaab: సంక్రాంతి కానుకగా ‘రాజాసాబ్’ పోస్ట‌ర్ రిలీజ్‌

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్(PRABHAS) నటిస్తోన్న హర్రర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’(RajaSaab) నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ లుక్‌లో తమ హీరో అదిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News