Homeచిత్ర ప్రభTeaser : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వెరైటీ ఫన్ రైడ్.. టీజర్ లాంచ్‌లో హీరో శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్...

Teaser : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వెరైటీ ఫన్ రైడ్.. టీజర్ లాంచ్‌లో హీరో శ్రీవిష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sree Vishnu Comrade Kalyan movie teaser launch : కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ గా పేరుపొందిన హీరో శ్రీవిష్ణు తాజాగా పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రంతో అలరించబోతున్నారు. మహిమా నంబియార్ కథానాయిక. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

ఇప్పటికే గ్లింప్స్, పాటలతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే…1992లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఇందులో శ్రీ విష్ణు థియేటర్ ఓనర్‌గా కనిపించారు. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తికి ఆయన వీరాభిమాని. ఆయన సినిమాలనే ఎక్కువగా థియేటర్‌లో ప్రదర్శిస్తుంటాడు. ఇలా సంతోషంగా, ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోతున్న అతని జీవితంలోకి ఓ ఒడియా అమ్మాయి వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి. చివరికి అతడిని నక్సలిజం వైపు నడిపించే పరిస్థితులు ఏర్పడతాయి. సీరియస్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ దర్శకుడు జనకిరామ్ మారెళ్ల ఈ కథను ప్రధానంగా హ్యూమర్ యాంగిల్‌లో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, “కామ్రేడ్ అంటే స్నేహితుడు. కళ్యాణ్ అంటే శుభం. ఎప్పుడూ పక్కవాళ్ల శుభం కోరుకునే స్నేహితుడు. వెరైటీ ఫన్ రైడ్‌లా ఉంటుంది” అని అన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “కామ్రేడ్‌ని విడగొడితే కామ్ రెడీ. నిశ్శబ్దంగా ఉండే రాజు, మెల్లగా వచ్చ, హృదయాలను దోచే రాజు” అని పేర్కొనగా…ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, “కొత్త దర్శకులకు శ్రీ విష్ణు అవకాశాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసే వారిని కామ్రేడ్స్ అంటారు. కాకపోతే సెన్సార్ వాళ్లు ‘కామ్రేడ్’ అనే పదంపై అభ్యంతరం తెలిపారని విన్నాను. సెన్సార్ ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు. ఇది  భావ ప్రకటన స్వేచ్ఛ. దాన్ని అడ్డుకోవద్దు. ఇది నా విజ్ఞప్తి” అని చెప్పారు. నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ, “కామ్రేడ్ అంటే మన కష్టంలో, నష్టంలో మన చేయి వదలకుండా చివరి వరకు మనతో ఉండే వాళ్లని కామ్రేడ్స్ అంటారు. శ్రీ విష్ణు ప్రతి సినిమాకి 10 మెట్లు పైకి ఎక్కుతున్నాడు. తన సక్సెస్ రేట్‌ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది” అని చెప్పారు. ఇంకా ఈ ఈవెంట్ లో డైరెక్టర్లు బాబీ, వీఎన్ ఆదిత్య, శివ నిర్వాణ, నందిని రెడ్డి, బీవీఎస్ రవి, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News