Friday, January 16, 2026
Homeచిత్ర ప్రభSreeleela: ఇకపై ఎంత పెద్ద స్టారైనా అందుకు నో చెప్పిన శ్రీలీల.. ఎందుకంటే?

Sreeleela: ఇకపై ఎంత పెద్ద స్టారైనా అందుకు నో చెప్పిన శ్రీలీల.. ఎందుకంటే?

Sreeleela: ఇకపై ఎంత పెద్ద స్టారైనా స్పెషల్ సాంగ్‌కి నో అంటోంది డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. తెలుగులో ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజ సరసన నటించిన ‘ధమాకా’ మంచి కమర్షియల్ సక్సెస్ చూసింది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్, వైష్ణవ్ తేజ్, రామ్ పోతినేని, మహేష్ బాబు లాంటి హీరోలతో ఆడిపాడింది. అలాగే, నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి సినిమాలోనూ కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది.

- Advertisement -

అయితే, ఈ డాన్సింగ్ క్వీన్ కి పెద్ద సక్సెస్‌లు మాత్రం దక్కలేదు. వరుస ఆఫర్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మధ్యలో ముంబై టు చెన్నై కూడా సినిమాల కోసం ట్రావెల్ చేస్తోంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఆషికీ 3 చేస్తోంది. అలాగే, మరికొన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇక, తమిళంలో నటించిన డెబ్యూ మూవీ పరాశక్తి ఈ జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఇలా, సినిమాలకు ఏమాత్రం కొదవలేదు.

Also Read- Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు హుక్ స్టెప్‌తో రఫ్ఫాడించారు

ఈ క్రేజ్‌ని.. శ్రీలీల డాన్స్‌ని దృష్ఠిలో పెట్టుకొని ఐటం సాంగ్స్ కోసం కూడా అడుగుతున్నారు. దీనికి కారణం ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప 2లో కిస్సిక్ అనే డాన్స్ నంబర్ చేయడమే. మొదటి భాగంలో ఊ అంటావా మావా.. అంటూ సమంత ఆడిపాడింది. ఆ సాంగ్ ఎంత హిట్టైందో అందరికీ తెలిసిందే. అలాగే, శ్రీలీల చేసిన కిస్సిక్ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. అప్పటి నుంచి స్పెషల్ నంబర్స్ కోసం శ్రీలీలని మేకర్స్ అప్రోచ్ అవుతున్నారు.

కానీ, వాటిని ఈ బ్యూటీ రిజెక్ట్ చేస్తోందట. పరాశక్తి ప్రమోషన్స్‌లో భాగంలో ఓ ఇంటర్వ్యూలో దీనికి సంబందించి చెప్పిన శ్రీలీల.. కిస్సిక్ సాంగ్ చేయడం వల్ల తనకి మంచి పాపులారిటీనే వచ్చిందని.. అయినా కూడా ఇప్పటి నుంచి నేను హీరోయిన్‌గా నటించే సినిమాలలోనే స్పెషల్ సాంగ్ చేస్తాను.. అంతే తప్ప ఇకపై ఎంత పెద్ద స్టార్ నటిస్తున్న సినిమాలోనైనా ఐటం సాంగ్ ఆఫర్ వచ్చినా చేయనని తెగేసి చెప్పింది. ఇది ఒకరకంగా అటు నిర్మాతలకి, ఇటు డాన్సింగ్ క్వీన్ ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ న్యూసే. కానీ, శ్రీలీల తీసుకున్న కఠిన నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు కదా.

Also Read- Toxic Teaser: ‘రాయ‌’గా క‌న్న‌డ రాక్టింగ్ స్టార్ య‌ష్‌.. టీజ‌ర్ విడుద‌ల‌.. సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News