Tuesday, December 9, 2025
Homeచిత్ర ప్రభSreeleela: డెబ్యూ మూవీ కోసం త‌మిళంలో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన శ్రీలీల

Sreeleela: డెబ్యూ మూవీ కోసం త‌మిళంలో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన శ్రీలీల

Sreeleela: శివ‌కార్తికేయ‌న్ ప‌రాశ‌క్తి మూవీతో త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీలీల‌. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఎక్కువ‌గా గ్లామ‌ర్ రోల్స్‌లో క‌నిపించిన శ్రీలీల ప‌రాశ‌క్తిలో స్టూడెంట్ లీడ‌ర్‌గా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్‌ క్యారెక్ట‌ర్ చేస్తోంది. ఫ‌స్ట్ లుక్‌తో పాటు ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాంగ్‌లో రెట్రో లుక్‌లో డిఫ‌రెంట్‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంది శ్రీలీల‌.

- Advertisement -

కాగా ప‌రాశ‌క్తి మూవీ కోసం త‌మిళంలో శ్రీలీల సొంతంగా డ‌బ్బింగ్ చెబుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో శ్రీలీల చెప్పిన డ‌బ్బింగ్‌కు ప‌ర్‌ఫెక్ట్ అంటూ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర థంబ్ సింబ‌ల్ చూపిస్తూ మెచ్చుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ వీడియోలో శ్రీలీల క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

శ్రీలీల‌కు త‌మిళంలో ఇదే మొద‌టి మూవీ. అయినా క‌ష్ట‌ప‌డి త‌మిళం నేర్చుకోవ‌డ‌మే కాకుండా సొంతంగా డ‌బ్బింగ్ కూడా చెబుతోన్న శ్రీలీల‌పై సినీ ల‌వ‌ర్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సీనియ‌ర్ హీరోయిన్లు న‌య‌న‌తార‌, త్రిష లాంటివారు ఇప్ప‌టికీ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌ల‌పై ఆధార‌ప‌డుతున్నార‌ని, వారితో పోలిస్తే శ్రీలీల చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ప‌రాశ‌క్తి రిలీజ్ అవుతోంది. మూడు భాష‌ల్లో త‌న పాత్ర‌కు శ్రీలీల‌నే సొంతంగా డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Also Read – Highest Budget Movie: ఇండియాలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమాలు ఇవే – టాప్ త్రీలో మ‌హేష్‌బాబు, బ‌న్నీ మూవీస్‌!

ప‌రాశ‌క్తి మూవీలో జ‌యం ర‌వి విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మ‌రో కీల‌క పాత్ర‌లో అథ‌ర్వ ముర‌ళి న‌టిస్తున్నాడు. 1960 బ్యాక్‌డ్రాప్ స్టూడెంట్ పాలిటిక్స్, కాలేజీ గొడ‌వ‌లు చుట్టూ ప‌రాశ‌క్తి సినిమా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. సంక్రాంతికి త‌మిళంలో ప‌రాశ‌క్తితో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ అవుతున్నాయి. వ‌రుస ప‌రాజ‌యాల కార‌ణంగా తెలుగులో శ్రీలీల‌కు అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ప‌రాశ‌క్తితో హిట్టు కొట్టి త‌మిళంలో పాగా వేయాల‌ని ప్లాన్ చేస్తోంది.

ప‌రాశ‌క్తి రిలీజ్ కాక‌ముందే కోలీవుడ్‌లో శ్రీలీల మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సెకండ్ మూవీలో కూడా శివ‌కార్తికేయ‌న్‌తో జోడీ క‌ట్ట‌బోతుంది. సిబీ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది మొద‌లు కాబోతుంది. కాగా ఇటీవ‌లే తెలుగులో మాస్ జాత‌ర‌తో ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది శ్రీలీల‌. ర‌వితేజ హీరోగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం శ్రీలీల చేతిలో ఒకే ఒక తెలుగు మూవీ ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌లో మెయిన్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది శ్రీలీల. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ కాబోతుంది.

Also Read – Balakrishna: బాలకృష్ణ మాటలకి బాలీవుడ్ షేక్ అవుతుందా..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News