Sreeleela: తమిళ మూవీ పరాశక్తి సక్సెస్ మీట్‌లో తెలుగు డైరెక్టర్లపై శ్రీలీల సెటైర్లు వేసింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాతోనే కోలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ అవార్డ్ వినర్ సుధా కొంగర పరాశక్తికి దర్శకత్వం వహించారు. హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శివకార్తికేయన్, జయం రవితో పాటు శ్రీలీల యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరొస్తుంది. ఈ సినిమాలో రెట్రో లుక్‌లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో కూడిన క్యారెక్టర్‌లో శ్రీలీల నటించింది. రత్నమాల పాత్రకు ఈ బ్యూటీ పర్‌ఫెక్ట్ యాప్ట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. నాచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టిందని చెబుతున్నారు.
మంగళవారం మేకర్స్ పరాశక్తి సక్స్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో శ్రీలీల మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో నా డ్యాన్స్‌ల గురించే ఎక్కువగా మాట్లాడేవారు. పాటల్లో బాగా కనిపించావని మాత్రమే ప్రశంసించేవారు. ఫస్ట్ టైమ్ పరాశక్తి మూవీతో నా యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. కథ, నా క్యారెక్టర్‌తో కనెక్ట్ కావడమే కాకుండా ఆడియెన్స్ ఎమోషనల్ అవుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. యాక్టర్‌గా ఈ సినిమాతోనే డెబ్యూ ఇచ్చిన ఫీలింగ్ కలిగింది’ అని శ్రీలీల చెప్పింది.
Also Read – Yellamma Movie: దిల్ రాజు – బలగం వేణు సినిమా అప్‌డేట్ వచ్చేసింది..
శ్రీలీల కామెంట్లను తెలుగు ఆడియెన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇన్‌డైరెక్ట్‌గా తనలోని యాక్టింగ్ టాలెంట్‌కు తగ్గ పాత్రలు తెలుగు డైరెక్టర్లు ఇవ్వలేకపోయారంటూ శ్రీలీల చెప్పకనే చెప్పిందని అంటున్నారు. కేవలం తనను డ్యాన్స్‌లు, పాటల కోసమే తెలుగు దర్శకులు వాడుకున్నారంటూ శ్రీలీల కామెంట్ల వెనుక అర్థముందని చెబుతున్నారు. భగవంత్ కేసరిలో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలోనే శ్రీలీల కనిపించింది. ఆ మూవీ నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. భగవంత్ కేసరి పేరు కూడా ఎత్తకుండా పరాశక్తిపై పొగడ్తలు కురిపించడం బాగాలేదని విమర్శలు కురిపిస్తున్నారు. ఆ తెలుగు సినిమాల వల్లే తమిళంలో అవకాశాలు వచ్చిన విషయం శ్రీలీల గుర్తుపెట్టుకుంటే మంచిదంటూ ట్రోల్ చేస్తున్నారు. పరాశక్తి మూవీ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. డిజాస్టర్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌తో పాటు హిందీలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Also Read – The Raja Saab: బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘ది రాజా సాబ్’ దూకుడు.. నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి!

